తూర్పుగోదావరి

సత్యదేవుని సేవలో ఇన్‌కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంఖవరం, జనవరి 2: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి వారి సేవలో ఇన్‌కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ సిహెచ్ ఓంకారేశ్వర కుటుంబసమేతంగా శనివారం పాల్గొన్నారు. కమిషనర్ ఓంకారేశ్వరకు దేవస్థానం సహాయ కమిషనర్ ఇవి జగన్నాధరావు ఆధ్వర్యంలో వేద పండితులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన సత్యదేవుని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి యంత్రాలయం వద్ద ఆయనకు వేద పండితులు వేదాశీస్సులు అందించగా, సహాయ కమిషనర్ జగన్నాధం ఓంకారేశ్వరకు స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందించారు.

పోలవరం ప్యాకేజీ పెంచాలి

కూనవరం, జనవరి 2: పోలవరం ప్రోజెక్టు కింద ముంపునకు గురైన నిర్వాసితుల ప్యాకేజీని పెంచాలని జన్మభూమి గ్రామ సభలు నిర్వహించిన గ్రామాల్లో ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేశారు. శనివారం రేగుళ్లపాడు, లింగాపురం, పోచవరం, కాచవరం పంచాయతీలలో జన్మభూమి- మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశాలకు హాజరైన ఆయా గ్రామస్థులు ప్యాకేజీపై స్పష్టత లేదని, నూతన భూ సేకరణ చట్టప్రకారమే ఎకరం భూమికి రూ.12 లక్షలు, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఒక్కో కుటుంబానికి రూ.20లక్షలు చొప్పున ఇవ్వాలని అధికారులతో తీర్మానాలు చేయించారు. పోచవరం, కాచవరం పంచాయతీలలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన సరుకుల్లో నాణ్యత లేదని అధికారులకు ఫిర్యాదు చేశారు. తాళ్లగూడెం, లింగాపురం గ్రామాలలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరారు. ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమస్యలను ఉన్నతాధికారులకు నివేదిస్తానని చెప్పారు. 148 దరఖాస్తులు వచ్చాయని, వీటిని పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమాలలో ఎంపిపి పెంటయ్య, జడ్పీటీసీ కన్యకాపరమేశ్వరి, తహసీల్దార్ నర్సింహులు, ఎంపిడిఒ రామారావు, సూపరింటెండెంట్ సత్యనారాయణ, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.