క్రైమ్/లీగల్

కోనపాపపేటలో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యు కొత్తపల్లి, నవంబర్ 10: కొత్తపల్లి మండలం కోనపాపపేట సముద్ర తీరంలో ఉన్న మత్స్యకార గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోనపాపపేట గ్రామానికి చెందిన కొందరు మత్స్యకారులు సముద్రపు ఒడ్డున గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. ఆ గుడిసెలకు సమీపంలోనే చెత్తకుప్పలున్నాయి. చెత్తకుప్పలకు నిప్పు అంటుకుని ఉండటాన్ని స్థానికులు గుర్తించలేదు. దీంతో చెత్తకుప్ప నుండి నిప్పురవ్వలు ఎగిరి గుడిసెలపై పడటంతో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మంటలు ఒక గుడిసె నుండి మరొక గుడిసెకు గాలి ద్వారా వ్యాపించి సుమారు ఏడు మత్స్యకార గుడిసెలు అగ్ని కీలల్లో చిక్కుకున్నాయి. దీంతో మత్స్యకారులు దాచుకున్న బంగారం, విలువైన వస్తువులు, బట్టలు కాలిపోవడంతో సుమారు రూ. 20 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు. మత్స్యకారులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇళ్ళు కాలిపోయిన వారిలో కె మరియా, ఎస్ ప్రసాద్, వాసుపల్లి దాసు, పి సతయ్య, చింతకాయల ముత్యాలు, సిహెచ్ కామరాజు, బి రాజుల గృహాలున్నాయి. సంఘటన తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి హుటాహుటిన చేసుకుని పెను నష్టాన్ని తగ్గించారు. ఈ ప్రమాదానికి గురైన మత్స్యకార గుడిసెల పక్కనే మరో 40 మత్స్యకార గుడిసెలు ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది రాకతో నష్ట తీవ్రత తగ్గింది. బాధిత కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండెం దొరబాబు, ఆనాల సుదర్శన్ పరామర్శించారు.