క్రైమ్/లీగల్

వీపేటిఎం పేరిట భారీగా టోకరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 11: అన్ని సెల్‌ఫోన్లకు రీచార్జి చేసేందుకు ప్రత్యేక వి పేటిఎం పేరిట యాప్ ఏర్పాటుచేసి ఉభయ రాష్ట్రాల్లో సుమారు రూ. 2 కోట్లకు టోకరా వేసిన వ్యక్తులను పోలీసులు గుర్తించారు. అన్ని సంస్థల సెల్‌ఫోన్లకు తమ వి పేటిఎం ద్వారా రీచార్జి చేస్తామని ఉభయ రాష్ట్రాల్లో పంపిణీదారులు, ఏజెంట్లను నియమించి, వారి నుంచి రూ. లక్షల్లో వసూలు చేశారు. సాధారణంగా వివిధ కంపెనీల రీచార్జిపై 2 శాతం మాత్రమే కమిషన్ ఇస్తారని, తమ సంస్థ ద్వారా 12 శాతం వరకు కమిషన్ పొందవచ్చని మభ్యపెట్టారు. దీంతో వందలాది మంది సంస్థలో సొమ్ములు జమచేశారు. ఎనిమిది నెలల పాటు సక్రమంగా నిర్వహించిన సంస్థ నిర్వాహకులు ఆ తరువాత బోర్డు తిప్పేశారు. కర్నూలుకు చెందిన బాధితులు ఫోన్ చేయగా, బెంగుళూరు, ముంబయ్‌లో ఉన్నట్లు నమ్మించారు. చివరకు రాజమహేంద్రవరంలో ఉన్నట్లు గుర్తించిన బాధితులు తమను మోసం చేసిన సంస్థ ప్రతినిధిని త్రీటౌన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసును విచారిస్తున్నారు.