తూర్పుగోదావరి

వివాదాస్పదమైన ఫ్లెక్సీల తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, నవంబర్ 12: మరికొన్ని గంటల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బహిరంగ సభ జరగనుండగా ఆ పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లను మున్సిపల్ సిబ్బంది తొలగించడం సోమవారం కాకినాడలో ఉద్రిక్తతకు దారితీసింది. సోమవారం సాయంత్రం కాకినాడ కల్పనా సెంటర్‌లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు పార్టీ నేతలు ఏర్పాట్లుచశారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లను ఏర్పాటుచేశారు. అయితే వీటిని మున్సిపల్ సిబ్బంది సోమవారం ఉదయం తొలగించారు. బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగిస్తున్నారని తెలుసుకున్న పార్టీ నాయకులు పంతం నానాజీ, జ్యోతుల వెంకటేశ్వరరావు తదితరులు హుటాహుటిన కల్పనా సెంటర్‌కు చేరుకుని ఫ్లెక్సీలను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో కల్పనా సెంటర్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. తొలగించిన తమ పార్టీ అధినేత బ్యానర్లు, ఫ్లెక్సీలను తిరిగి అదే ప్రాంతంలో ఏర్పాటుచేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని పార్టీ నాయకులు హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి చేరుకుని జననేన నాయకులతో చర్చించారు. తుదకు తొలగించిన ఫ్లెక్సీను యధావిధిగా ఏర్పాటుచేశారు. దీంతో వివాదం సర్దుమణిగింది. వివాదం ముగిసిన అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను పెద్ద ఎత్తున కల్పానా సెంటర్‌కు తరలించి ఏర్పాటుచేశారు. సాయంత్రం పార్టీ అధినేత పాల్గొనే సభావేదికను, మహిళలు తిలకించేందుకు, పార్టీ ముఖ్య నాయకులు వేదిక వద్ద ఉండేందుకు గ్యాలరీని రోడ్డుపై తాత్కాలికంగా నిర్మించారు. ఉద్రిక్తత పరిస్థితులు మరోసారి తలెత్తకుండా పోలీసులు ఉదయం నుండి సభావేదిక ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటుచేశారు.