తూర్పుగోదావరి

పేదరికం రూపుమాపడమే సీఎం లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, నవంబర్ 12: రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపి ప్రతీ కుటుంబం ఆనందంగా జీవించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. పేదరికంపై గెలుపు కార్యక్రమంలో భాగంగా ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కులాల లబ్ధిదారులకు, ఆదరణ-2 పథకంలో ఎంపికైన లబ్ధిదారులకు రుణాలు, ఉపకరణాల పంపిణీ కార్యక్రమం స్థానిక కిమ్స్ వైద్య కళాశాల ఆవరణలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్డి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిధిగా పాల్గొని లబ్ధిదారులకు రుణాలు, ఉపకరణాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన జరిగిన సభలో రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పేదవారనేవారెవరూ ఉండకూడదనే ఉద్దేశంతోనే పేదరిక రేఖకు దిగువన ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కులాల, చేతి వృత్తుల వారికి చేయూతనిచ్చి తద్వారా వారికి ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అనిర్వచనీయమన్నారు. రానున్న ఎన్నికల్లో మీరు చూపే ప్రేమాభిమానాలే పార్టీకి శ్రీరామరక్షని ఆర్‌ఎస్ పేర్కొన్నారు. రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని చేతి వృత్తుల వారికి అవసరమైన పరికరాలు అందించడం ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పీ గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ముఖ్యమంత్రి చిరునామా అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత భారీ ఎత్తున చేతి వృత్తుల వారికి సహకారం అందించలేదన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ మల్లికార్జున మాట్లాడుతూ రుణాలు, ఉపకరణాలు పొందిన వారు వాటిని సక్రమంగా వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. ఈ పథకంలో లబ్ధి పొందిన వారు రుణాలను సకాలంలో చెల్లిస్తే మరికొంత మందికి లబ్ధి చేకూర్చడానికి అవకాశం ఉంటుందని జేసీ వివరించారు. ఈ సందర్భంగా అమలాపురం డివిజన్‌లోని 3889 మంది లబ్ధిదారులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్‌ల ద్వారా మంజూరైన రూ.64.26 కోట్లు రుణాలను, 4,302 మంది వివిధ చేతి వృత్తుల వారికి మంజూరైన ఉపకరణాలను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కే రవికిరణ్‌వర్మ, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్డీవో బీ వెంకటరమణ, ఎంపీపీ, జడ్పీటీసీలు పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని నెం.1గా తీర్చిదిద్దేందుకు సీఎం కృషి
ఎమ్మెల్యే తోట
రామచంద్రపురం, నవంబర్ 12: భారీ ఆర్థిక లోటుతో విడివడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అన్నారు. స్థానిక రెవెన్యూ డివిజన్ పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆదరణ పథకం లబ్ధిదారులకు యూనిట్లు అందించడానికి స్థానిక శ్రీ కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ క్రీడా ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలోనే ఆదరణ పథకాన్ని ప్రారంభించారని, చేతివృత్తుల వారిని ప్రోత్సహించి వారికి ఆర్థిక పరిపుష్టి కలిగించడానికి కృషిచేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రులతో తనకు గల సాన్నిహిత్యం ద్వారా వంద పడకల ఆసుపత్రి, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పామర్రులో జూనియర్ కళాశాల, ద్రాక్షారామలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూలు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల తదితరాలు సాధించినట్టు చెప్పారు. రామచంద్రపురం పట్టణంలో సొంతింటి కల నెరవేర్చేందుకు కృషిచేస్తున్నట్టు చెప్పారు. సుమారు 25 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న తన కోరిక నెరవేరడం లేదని, భూమి రేట్లు పెరగడంతో జి ప్లస్ 3 ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఫేజ్ 1 ద్వారా నిర్మితమైన 1088 ఇళ్లను నెలాఖరులోగా పంపిణీకి సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. మరో 2021 ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, అవినీతికి సుదూరంగా, దళారులు లేకుండా, ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా ఎన్నికలకు ముందే గృహాలు లబ్ధిదారులకు అందించనున్నట్టు చెప్పారు. ఆదరణ పథకానికి సంబంధించి లబ్ధిదారులతో పలుమార్లు అవగాహన సదస్సులు నిర్వహించి వారికి అనుకూలమైన పనిముట్లు ఇవ్వడం ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పించినట్టు చెప్పారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ మండపేటలో 4,064 జి ప్లస్ 3 ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు కృషి చేస్తున్నామని, సెకండ్ ఫేజ్‌లో సగం పూర్తయ్యాయని, మార్చినాటికి మొత్తం పూర్తవుతాయని తెలిపారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఒకే రోజున రాష్టవ్య్రాప్తంగా ఆదరణ పథకాన్ని అమలు చేసిన ఘనత చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. అనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు 600 కోట్ల రూపాయలు, సంక్షేమానికి 900 కోట్ల రూపాయలు వ్యయం చేసినట్టు చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలోనే అత్యధికంగా అమలుచేసినట్టు రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అంతకుముందు జాయింట్ కలెక్టర్ 2 సిహెచ్ సత్తిబాబు, ఆర్డీవో ఎన్ రాజశేఖర్ పథకం వివరాలు వెల్లడించారు. సమావేశానికి ముందు ఎమ్మెల్యేలు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు నల్లమిల్లి వీర్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. సమావేశంలో జడ్పీ వైస్ ఛైర్మన్ పెండ్యాల నళినీకాంత్, రామచంద్రపురం పురపాలక ఛైర్‌పర్సన్ శ్రీరాజా కాకర్లపూడి రాజగోపాల నర్సరాజు (గోపాల్‌బాబు), ఎంపీపీ వినకోటి శ్రీనివాస్, జడ్పీటీసీ మేడిశెట్టి రవికుమార్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ గరికిపాటి సూర్యనారాయణమూర్తి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ మేడిశెట్టి సూర్యనారాయణ, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ మీర్జా, ఖాజిం హుస్సేన్ (చోటూ) డీసీసీబీ డైరెక్టర్ చిలుకూరి విశే్వశ్వరరావు, మండపేట ఏఎంసీ ఛైర్మన్ పాలిక శ్రీను, మున్సిపల్ మాజీ ఛైర్మన్ కొమ్మన నాగేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ వెంటపల్లి జాన్‌మార్క్, ఆత్మ బ్లాక్ ఛైర్మన్ అల్లూరి దొరబాబు తదితరులు పాల్గొన్నారు.