తూర్పుగోదావరి

ఆనంద సమాజం ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, నవంబర్ 12: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక అసమానతలు లేని ఆనంద సమాజం లక్ష్యంగా పేదరిక నిర్మూలనకు బడ్జెట్‌లో రూ.70 వేల కోట్ల నిధులు కేటాయించిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. కాకినాడ డివిజన్ పరిధిలో పేదరికంపై గెలుపు-మెగా గ్రౌండింగ్ మేళాను సోమవారం స్థానిక ఆనంద భారతి మైదానంలో సంక్షేమ కార్పొరేషన్లు, మున్సిపల్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల హాజరయ్యారు. ముందుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్, జ్యోతీరావు పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి మెగా మేళాను యనమల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ మహాత్ముడు రాజకీయ స్వాతంత్య్రం కోసం పోరాడితే, పూలే, అంబేద్కర్, జగజ్జీవన్‌రామ్‌లు ఆర్థిక స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారన్నారు. ఈ మహనీయుల ఆశయాలే రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన, సంక్షేమ కర్యాక్రమాలకు మార్గదర్శక ఆదర్శాలని పేర్కొన్నారు. సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఆర్థిక అసమానతలేనని, బడుగు వర్గాలకు విద్యాప్రోత్సాహం, సంక్షేమ, ఉపాధి కార్యక్రమాల ఆలంబనల ద్వారా వీటిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. ప్రభుత్వం బీసీల సంక్షేమానికి రూ. 12 వేల కోట్లు, ఎస్సీల సంక్షేమానికి రూ. 9 వేల కోట్లు, గిరిజన సంక్షేమానికి రూ. 4 వేల కోట్లు, కాపుల సంక్షేమానికి ప్రతీ సంవత్సరం వెయ్యికోట్లు, బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.65 వేల కోట్లు, వైశ్యుల సంక్షేమానికి రూ. 35 వేల కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన ఇతర ఉన్నత వర్గాల సంక్షేమానికి రూ. 100 కోట్లు, వెరశి రూ. 70 వేల కోట్లు పైబడి నిధులను పేదరిక నిర్మూలన, సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం ఖర్చుచేస్తోందని మంత్రి యనమల తెలిపారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు కృషిచేస్తూ పెరిగిన ఆదాయాన్ని ప్రధానంగా ప్రజాసంక్షేమానికి ఖర్చుచేస్తున్నామని పేర్కొన్నారు. తమది సంపదను పంచే ప్రభుత్వమని, దోచుకునే ప్రభుత్వం కాదని చెప్పారు. నిధుల కొరత ఉన్నప్పటికీ అప్పు చేసైనా ప్రజల అవసరాలు, ఆకాంక్షలు నెరవేరుస్తున్నామన్నారు. నాలుగు వేల కోట్ల రూపాయలు రైతుల రుణ విముక్తికి, రూ. 2 వేల కోట్లు మహిళాసంఘాల ఆర్థిక పరిపుష్టికి ఖర్చు చేస్తున్నామని ఆయన తెలిపారు. వివిధ సర్వేల ప్రకారం రాష్ట్రంలో 9 శాతం ఆర్థిక పేదరికం ఉండగా, జీవన ప్రమాణాల పరంగా 21 శాతం పేదరికం ఉందని చెప్పారు. ప్రతి కుటుంబానికి కనీసం 10 వేల రూపాయలు నెల ఆదాయం కల్పనతో రాష్ట్రంలో అన్ని రకాల పేదరికాలను రూపుమాపేందుకు, ప్రజల జీవితాల్లో ఆనందం నింపడమే ప్రభుత్వం లక్ష్యంగా కృషిచేస్తుందని ఆర్థిక మంత్రి యనమల తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలోని 7 డివిజన్ కేంద్రాల్లో ఈ మెగా రుణమేళా ద్వారా 25 వేల 958 మంది లబ్ధిదారులకు రూ. 280 కోట్ల విలువైన సంక్షేమ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు, ఆదరణ ఆస్తుల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎన్ వర్మ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లక్ష్యాలను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి యనమల వివిధ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా అందించిన రూ. 6902.35 లక్షల విలువైన రుణాలు, ఆదరణ ఆస్తులను కాకినాడ డివిజన్ పరిధిలో 5 వేల 337 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అదే విధంగా ఆదరణ-2 పథకం ద్వారా డివిజన్ పరిధిలోని 1275 మందికి రూ. 191.27 లక్షల విలువైన ఉపకరణాలు అందజేశారు. సంక్షేమ రుణ యూనిట్ల గ్రౌండింగ్‌లో విశేష సేవలు అందజేసిన 8 మంది బ్యాంకు అధికారులను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సత్కరించారు. ఈ కార్యక్రమంలో జేసీ-2 సిహెచ్ సత్తిబాబు, డిఆర్‌ఒ సుబ్బలక్ష్మి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం జ్యోతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డేవిడ్‌రాజు, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ ప్రభాకరరావు, నగర డిప్యూటీ మేయర్ కెఎస్‌ఎస్ సత్తిబాబు, కాకినాడ ఇన్‌చార్జ్ కమిషనర్ సత్యవేణి, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.