తూర్పుగోదావరి

మార్ట్ సిటీలో దోమలతో పాట్లా...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, నవంబర్ 12: స్మార్ట్ సిటీగా రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చేప్పే కాకినాడ నగరంలో దోమలతో ప్రజలు పాట్లు పడుతుండటం విడ్డూరంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జిల్లా కేంద్రం కాకినాడలో సోమవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈసందర్భంగా సభకు హాజరైన వారు దోమలతో బాధలుపడుతున్నామని చూపిస్తున్న ప్లకార్డును ఆయన తీసుకుని, ఈ వ్యాఖ్యానం చేశారు. రాష్ట్రంలో ఏమూలకు వెళ్లినా వేల కోట్ల అవినీతి కనిపిస్తోందని, ప్రజలకు మాత్రం సరైన రోడ్లు లేవని, వైద్య సౌకర్యాలు అందడంలేదన్నారు. అలాగే కంచే చేను మేస్తే అన్నట్టు మా ఎమ్మెల్యే ముంచేశారు ఆదుకోవాలి’ అంటూ మత్స్యకారులు చూపించిన ఫ్లకార్డును సైతం ఆయన అందుకుని గంగపుత్రుల కళ్లలో గంగ నిండేలా చేసిన వారి భరతం పడతామన్నారు. గంగపుత్రులకు తాను అండగా ఉంటానన్నారు. ఒకప్పుడు పదవీవిరమణ అనంతరం జీవించడానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని కాకినాడ నగరాన్ని పేర్కొనేవారని, పోస్టుమాస్టర్‌గా పనిచేసి రిటైరైన తన పెదనాన్న స్వయంగా ఈ విషయం చెప్పేవారన్నారు. అయితే ప్రస్తుతం కాకినాడ నగరం భూకబ్జాలకు, అవినీతి కార్యకలాపాలకు, దోపిడీలకు అడ్డాగా మారిపోయిందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రానికి అన్నం పెట్టే గోదావరి జిల్లాల్లో తన మూలాలున్నాయని, అందుకే ఈ జిల్లాల్లో ఎక్కువ కాలం పర్యటిస్తున్నాని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తనకు ఈ జిల్లాలు గుండెకాయ వంటివన్నారు. ఇంత ప్రకృతి సంపద ఉండీ ఈ జిల్లాల ప్రజలు ఇబ్బందులు పడుతుండటం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రిగారు మాట మార్చే విధానం ఆయన అబద్దాలు చెప్పే విధానం చూస్తే మన కాకినాడలోని సముద్రం ఎండిపోతుందని భయం వేస్తుంది. నారా లోకేష్ తరహాలో తన తాత, తండ్రి ముఖ్యమంత్రులు కారని, తనవద్ద వేల కోట్లు లేవని, అయినా ప్రజలకు సేవచేయాలని, సమాజంలో మార్పు తీసుకురావాలనే దృఢ సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కాకినాడలోనే ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ తీర్మానించి, రాష్ట్ర విభజనకు సహకరించిన బీజేపీ, అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో స్థానం లేదని ఢిల్లీలోని మోదీకి, రాహుల్‌కు వినిపించేలా ఇదే కాకినాడ కేంద్రంగా తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాకినాడ లోక్‌సభ స్థానంతోపాటు ఆ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి పట్టం కట్టాలని పవన్ కళ్యాణ్ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. జనసేన ద్వారా రాష్ట్రంలో సరికొత్త బాధ్యత కలిగిన రాజకీయ వ్యవస్థను నెలకొల్పుతామన్నారు.
నాలుగున్నరేళ్లుగా గిరిజనులు గుర్తులేరా!
నాలుగున్నరేళ్లుగా గిరిజనులు గుర్తుకు రాని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మరణించాకే గుర్తుకువచ్చారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎవరైనా నాయకులు చనిపోతేనే మంత్రి పదవులు ఇస్తారా అని ప్రశ్నించారు. అధికారం చేపట్టిన ఈ నాలుగున్నర సంత్సరాల కాలంలో ముఖ్యమంత్రికి గిరిజనులు గుర్తులేరా అన్నారు. ఓట్ల రాజకీయాల కోసం గిరిజనులు నేడు సిఎంకు గుర్తుకు వచ్చారని ధ్వజమెత్తారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏజెన్సీలో బాక్స్‌యిట్ తవ్వకాలను పూర్తిగా నిషేధిస్తామని ప్రకటించారు.