తూర్పుగోదావరి

ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ వాహనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 15: జిల్లాలో కాలుష్య నివారణలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలక్ట్రికల్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. ప్రభుత్వ ఎలక్ట్రికల్ వాహనాలను వినియోగించాలని నిర్ణయం తీసుకోవడంతో దీనిపై చర్యలు చేపడుతున్నట్టు కలెక్టర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో నెడ్‌క్యాప్, ఇఇఎస్‌ఎల్, రవాణా అధికార్లతో కలెక్టర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో అద్దె ప్రతిపాదికన వినియోగిస్తున్న వాహనాలకు ప్రత్యామ్నాయంగా వీటిని వినియోగించనున్నామన్నారు. మొదటి విడతగా వచ్చే సంక్రాంతి నాటికి 100 వాహనాలను సిద్ధంచేయాలన్నారు. రోజుకు 100 కిలోమీటర్ల తిరిగే సామర్ధ్యం కలిగిన ఈ వాహనాలను నగర, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటుచేయాలన్నారు. ఈ వాహనాల నిర్వహణ కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుచేయాలన్నారు. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా ఈ వాహనాలను ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్ లిమిటెడ్ సంస్థ అద్దె ప్రాతిపదికన అందిస్తుందని కలెక్టర్ చెప్పారు. నగరంలో ఉన్న వైద్యులు కూడా ఈ సౌకర్యం కలిగించాలని డీసీటీని కోరారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాకు సుమారు 450 వరకు వాహనాలు వచ్చే అవకాశముందని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో డీటీసీ సిరి ఆనంద్, నెడ్‌క్యాప్ డీఎం జి సత్యనారాయణ, ఈఈఎస్‌ఎల్ ప్రతినిధి సురేష్ కుమార్, ఎంవిఐ జివి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.