తూర్పుగోదావరి

ఐదు వందల మందికి ఒక మరుగుదొడ్డి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, నవంబర్ 15: వేల సంఖ్యలో మరుగుదొడ్లు నిర్మించామని గొప్పలు చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు మంత్రి లోకేష్‌ను కాకినాడ నగరంలో మత్స్యకారుల నివాస ప్రాంతంలోని మరుగుదొడ్డికి తీసుకురావాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఐదువందల మందికి ఈ చిన్న మరుగుదొడ్డి మాత్రమే ఆధారమని, ఇక్కడి ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు. దీనికి నగరపాలక సంస్థ స్థానిక ప్రజల నుండి పన్నులు వసూలు చేస్తోందని చెప్పారు. పూర్తిగా శిథిలమైన మరుగుదొడ్డిని ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకుంటారని, ఆ మరుగుదొడ్డిని లోకేష్‌కు చూపించాలని అధికారులకు హితవు పలికారు. బుధవారం మధ్యాహ్నం కాకినాడలోని జి కనె్వన్షన్ హాలులో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. పోర్టు పేరుతో ఎడాపెడా దోచుకుంటున్న కాకినాడ సీపోర్ట్స్ సంస్థ కనీసం సీఎస్‌ఆర్ నిధులతోనైనా ఇక్కడ మరుగుదొడ్లు నిర్మించి ఉండాల్సిందన్నారు. కొత్త భూసేకరణ చట్టం అంశంపై అడిగిన ప్రశ్నకు పవన్ కల్యాణ్ సమాధానమిస్తూ మోడీ, చంద్రబాబు ఇద్దరు కన్వీనియంట్ పార్టనర్స్ అని అభివర్ణించారు. అగ్రిగోల్డు అంశంలో చాలా మంది కుమ్మక్కై ఉన్నారని, ముఖ్యంగా ఏజెంట్లను రక్షించాల్సి ఉందని తెలిపారు.
ముందుగా జనసేన నాయకుడు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కాకినాడ సముద్ర తీరంలో ఉన్న హోప్ ఐలాండ్ జిల్లాకు ఓ కవచం వంటిదన్నారు. దాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నారన్నారు. కాకినాడ సీపోర్టులో అక్రమ నిర్మాణాలు కారణంగా పర్యావరణానికి, ముఖ్యంగా మత్స్యకారులకు తీవ్ర నష్టం జరుగుతోందని హెచ్చరించారు. సీపోర్టులో ప్రస్తుతం ఉన్న బెర్తులకు అదనంగా మరో బెర్తును నిర్మించాలని చూస్తున్నారని, ఆ బెర్తును నిర్మిస్తే ఫిషింగ్ హార్బర్ పూర్తిగా కనుమరుగు అవుతుందన్నారు. హోప్ ఐలాండ్ ఎనిమిది కిలోమీటర్లు మేర ఉండేదని, అయితే ఇసుక అక్రమ తవ్వకాల కారణంగా నేడు అది రెండు కిలోమీటర్ల మేర విస్తీర్ణం తగ్గిపోయిందన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులపై తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోరాటం చేస్తారని చెప్పారు. విలేఖరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకుడు ముత్తా గోపాలకృష్ణ పాల్గొన్నారు.