తూర్పుగోదావరి

వన సమారాధనలతో స్నేహభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, నవంబర్ 17: కార్తీక మాసంలో నిర్వహించే వన సమారాధనల వల్ల అందరిలో స్నేహభావం వెల్లివిరుస్తుందని, ఇటువంటి వన సమారాధనలను ఆదరించాలని రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ అన్నారు. సామర్లకోట విస్తరణ శిక్షణ కేంద్రంలో శనివారం జిల్లా పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో హోం మంత్రి రాజప్ప, జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతియేటా వనసమారాధన నిర్వహిస్తున్న పోలీసు అధికారుల సంఘం నిర్వాహకులను వారు అభినందించారు. తొలుత మంత్రి రాజప్ప, ఎస్పీ విశాల్ గున్నీ ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. తొలుత వన భోజనాల్లో మంత్రి రాజప్ప, ఎస్పీ విశాల్ గున్నీ స్వయంగా హాజరైన వారికి వడ్డించారు. అనంతరం సమారాధనలో సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి, పెద్దాపురం డీఎస్పీ చిలకా వెంకట రామారావు, పెద్దాపురం సీఐ వై యువకుమార్, పట్టణ టీడీపీ అధ్యక్ష, కార్యదర్శులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, టీడీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్యం చంద్రరావు, జిల్లా పోలీసు అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు గంగిరెడ్డి బలరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.