తూర్పుగోదావరి

పోరాటాల ద్వారానే సమస్యలకు సరైన పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, నవంబర్ 17: దేశంలోనూ, రాష్ట్రంలోనూ పేద ప్రజల, భూమి తదితర సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటాల ద్వారానే సాధ్యం అవుతుందని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏపీ, తెలంగాణా రాష్ట్రాల ఛైర్‌పర్సన్ విమలక్క అన్నారు. సామర్లకోట శ్రీ భీమేశ్వర లయన్స్ క్లబ్ భవనంలో శనివారం రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విమలక్క ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చండ్ర పుల్లారెడ్డి వంటి నాయకులు భూ పోరాటాల్లో అమరులైన నాటి నుండి తమ పోరాటాలు నిరంతరం కొనసాగుతున్నాయన్నారు. చట్ట సభలు, చట్టాల ద్వారా ఎటువంటి న్యాయం జరగదని, కేవలం సంఘటిత పోరాటాల ద్వారానే పరిష్కారం అవుతాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల్లో హామీలు గుప్పించి, ప్రస్తుతం ప్రజలు ప్రశ్నించకుండా ఉండే రీతిలో ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ప్రజలను మూఢ విశ్వాసాల వైపు నడిపించి, ప్రశ్నిస్తున్న తమ సంఘాల నేతలపై తప్పుడు కేసులు పెట్టి, ఎన్‌కౌంటర్లలో హతమార్చి, జైళ్లలో మగ్గేలా చేస్తున్నారన్నారు. ఎన్నికల ముందు మోదీ ఇచ్చిన విభజన హామీలు అమలుచేయకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. భూ బకాసురులు పెరిగిపోయారని, వారిదే దోపిడీ రాజ్యం అన్నారు. పోరాటాల్లో సాధించుకున్న భూములను సైతం కబ్జాలు చేస్తూ తప్పుడు జీవోలతో గ్రావెల్ వ్యాపారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలోని కొండపల్లి, ఆనూరు, రామేశ్వరం పేట తదితర గ్రామాల్లో పేదలకు అప్పట్లో ఎన్టీఆర్ కేటాయించిన భూములను ఆక్రమించి దౌర్జన్యంగా కొండలను కబ్జాచేసి వేల కోట్లు దోపీడీ చేస్తున్నారన్నారు. వాటిపై పునఃసమీక్షించుకోవాలన్నారు. ప్రజలను, యువతను చైతన్యం చేసి సంఘటిత పర్చేందుకు నవంబర్ నెలంతా తెలుగు రాష్ట్రాల్లో అమరవీరుల సంస్మరణ సభలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో 9 వేల ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూములు, 25 వేల ఎకరాల దేవాదాయ భూములు పేర్లు మార్చుకుంటూ ఏళ్ల తరబడి భూస్వాముల చేతుల్లోనే ఉన్నాయన్నారు. వంతాడలో మట్టి మాఫియా సిమెంటు కంపెనీలతో కుమ్మక్కై మట్టిని తరలిస్తున్నారన్నారు. ఇంకా జిల్లాలో వున్న ప్రధాన సమస్యలపై ఉద్యమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ నరసింహయ్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకులు సుధాకర్, భాస్కర్, రమేష్, శిరీష, ప్రభాకర్, రాములన్న, రాకేష్, అఖిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ హక్కులను తిరగరాసేందుకు..
కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించే పనిలో చంద్రబాబు..
* జగ్గంపేటలో వైసీపీ బూత్ కమిటీ సమావేశంలో మాజీ ఎంపీ సుబ్బారెడ్డి
జగ్గంపేట, నవంబర్ 17: కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించి, రాజ్యాంగాన్ని తిరగరాసే పనిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారని వైసీపీ నేత, మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. శనివారం జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ కో-ఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన బూత్ కమిటీ సమావేశానికి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. రానున్న ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించేందుకు బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లు సుశిక్షితులైన సైనికుల్లా పనిచేసి జగన్మోహాన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలు, టీడీపీ నేతల అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపైనే ఉందన్నారు. ఒకవైపు ప్రధాని మోదీపై పోరాటం చేస్తున్నానని చెబుతూనే మరోవైపు పోలవరం ప్రాజెక్టు కేంద్ర పరిధిలో ఉంటే చంద్రబాబు ముఠామేస్ర్తి ఉద్యోగం ఎందుకు చేస్తున్నాడని ప్రశ్నించారు. గత 20 రోజుల క్రితం జగన్‌పై జరిగిన హత్యాయత్నం కొంతమంది అధికార పార్టీ నాయకుల కుట్రలో భాగమేనన్నారు. ఈ ఘటనపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు జ్యోతుల రామస్వామి, జక్కంపూడి రాజా, దవులూరి దొరబాబు, అనంత ఉదయ భాస్కర్, అమ్మాజీ, వెంకటేశ్వరరావు, బండారు రాజా, కట్టమూరి బంగారం, కంచి లక్ష్మణదొర, ఇళ్ల అప్పారావుకాపు తదితరులు పాల్గొన్నారు.
వైసీపీలో చేసిన టీడీపీ నేత రాయిసాయి
టీడీపీ జిల్లా విభాగ నేత రాయిసాయి తన అనుచరులతో శనివారం వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పార్టీ కండువాలతో సత్కరించి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.