తూర్పుగోదావరి

త్వరలో చేనేత రుణమాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, మే 5: రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఉదారంగా వ్యవహరిస్తున్నారని, త్వరలో చేనేత రుణమాఫీ జరుగుతుందని జిల్లా చేనేత ఝౌళి శాఖ సహాయ సంచాలకులు ఎస్‌ఎస్‌ఎస్‌ఆర్‌కెఆర్ ప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని హసనబాద గ్రామంలోని చేనేత సహకార సంఘాన్ని జిల్లా అధికారి ప్రసాద్ సందర్శించారు. సంఘం అభివృద్ధిని సమీక్షించిన అనంతరం పాలకవర్గాన్ని అభినందించారు. సంఘం ఉత్పత్తి చేస్తున్న డ్రెస్ మెటీరియల్‌తోపాటు లికో పేరుతో తయారవుతున్న లెనిన్ చీరలు, షర్టింగ్‌లను ప్రసాద్ పరిశీలన చేసి, ఆనందం వ్యక్తం చేశారు. 174 లక్షలు సంఘం నిధులు బ్యాంకుల్లో ధరావతు చేయడం, 164 లక్షల రూపాయల విలువైన విక్రయాలు జరిపి హసనబాద చేనేత సహకార సంఘం అరుదైన అభివృద్ధిని సాధించిందన్నారు. చేనేతల ఆరోగ్య భీమా పథకం కూడా అమలుచేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు, రాష్ట్ర చేనేత సహకార సంఘాల సమాఖ్య అధ్యక్షులు దొంతంశెట్టి విరూపాక్షం ప్రభుత్వం మంజూరు చేస్తున్న చిలపనూళ్ల సబ్సిడీలో 50 శాతం నిధులను సంఘాల్లో పనిచేస్తున్న సభ్యులకు ప్రొడక్షన్ బోనస్‌గా మంజూరు చేసేందుకు అనుమతించాలని కోరారు. జిల్లా అధికారి ప్రసాద్ సానుకూలంగా స్పందించారు.