తూర్పుగోదావరి

మొరాయించిన ఆదరణ వెబ్‌సైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాట్రేనికోన, డిసెంబర్ 4: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఆదరణ-2 పథకం నమోదుకు గడువు పెంచాలని బీసీలకు చెందిన చేతివృత్తులవారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 30 వరకు ఆదరణ పథకానికి దరఖాస్తు చేసుకునే గడువు ఉన్నా వారం రోజులు ముందుగానే ఆదరణ వెబ్‌సైట్ సర్వర్ మొరాయించడంతో చాలామంది అర్హులైన చేతివృత్తులవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోలేకపోయారు. ప్రభుత్వం ఈ వర్గాలకు చెందిన చేతివృత్తుల వారికి రూ. 30వేలు, రూ.20వేలు, రూ.10వేలు శ్లాబుల్లో వృత్తి పరికరాలు అందించడానికి ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టారు. బీసీలకు చెందిన కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చేనేత, మత్స్యకారులకు వృత్తి పరికరాలు, అలాగే మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ గడువులోగా అర్హులైన చేతివృత్తులవారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోలేక నష్టపోయారు. రోజూ మండల పరిషత్ కార్యాలయం, మీ సేవా, ఆన్‌లైన్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నా ఆదరణ సైట్ తెరుచుకోకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే ఈ పథకానికి కులం సర్ట్ఫికేట్లు సిద్ధం చేసుకుని ఆదరణ కోసం వెనుకబడిన వర్గాలు ఎదురుతెన్నులు చూస్తున్నాయి. ఇకనైనా ప్రభుత్వం ఆదరణ సైట్‌ను తెరిచి అర్హులైన చేతివృత్తులవారికి అవకాశం కల్పించాలని సర్వత్రా కోరుతున్నారు.

పిఎల్‌జీఎ వారోత్సవాలతో ఏజన్సీలో రెడ్ అలర్ట్
*విసృత్తంగా వాహనాలు తనిఖీ *ఏజన్సీ పోలీస్‌స్టేషన్ల్‌కు భారీభథ్రత
గంగవరం, డిసెంబర్ 4: మావోల పిఎల్‌జీఎ వారోత్సవాల నేపథ్యంలో ఏజన్సీలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. గత రెండు రోజులుగా రంపచోడవరం, చింతూరు ఏజన్సీపోలీస్ డివిజన్లుల్లో పోలీసులు నిఘా పెంచారు. అన్ని పోలీసు స్టేషన్లుకు భద్రతను పెంచారు. ఏజన్సీ ప్రాంతంలో గిరిజన గ్రామాలను పోలీసులు సందర్శించి కార్డన్ సెర్చ్ సర్చ్‌లు నిర్వహిస్తున్నారు. ఎస్పీ ప్రత్యేక పర్యవేక్షణలో మారుమూల ప్రాంతాలు, సమస్యాత్మక గ్రామాలపై పోలీసులు దృష్టి సారించి నిఘా పెంచారు. ఏజన్సీ ప్రాంతం వైపు వచ్చే పోయే అన్ని వాహనాలను విసృత్తంగా తనిఖీ చేస్తున్నారు. మంగళవారం అడ్డతీగల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో గంగవరం ఎస్సై రామలింగేశ్వరరావు మర్రిపాలెం గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తొలిత గంగవరం- అడ్డతీగల రూట్‌లో వాహనాలను, కల్వర్టులను తనిఖీలు చేశారు.