తూర్పుగోదావరి

పరాయి పంచన విద్యాభ్యాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐ పోలవరం, డిసెరంబర్ 4: నిధులు మంజూరు కాక స్కూలు భవనాల నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన నేపథ్యంలో ఆయా పాఠశాల విద్యార్థులు పరాయి పంచన విద్యాభ్యాసం కొనసాగించాల్సిన దుస్థితి గ్రామాలలో నెలకొంది. పశువుల్లంక పాఠశాలలో సుమారు 20 మంది విద్యార్థులు స్థానికంగా ఉన్న ఒక ప్రార్ధనా మందిరంలోనే చదువులు కొనసాగిస్తున్నారు. ఐ పోలవరం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పక్కనే ఉన్న ఎన్‌టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ భవనంలో కనీస వసతులు లేకుండా పాఠశాల నిర్వహిస్తున్నారు. ఇదిలావుండగా కేశనకుర్రు అరుంధతి నగర్‌లో నిర్మించిన సర్వశిక్షాభియాన్ భవనం నిధులు లేక కాంట్రాక్టర్లు అసంపూర్తిగా వదిలేయడం పట్ల పలువురు తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నపటికీ క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యంతో సకాలంలో నిధులు మంజూరు కాక కాంట్రాక్టర్లు నిర్మాణాలను అసంపూర్తిగా వదిలేస్తున్నారు. మండలంలోని పశుపుల్లంక పరిధిలోని అంబటివారిపేట, ఐ పోలవరంలోని ప్రాథమిక పాఠశాల భవనాలకు సర్వశిక్షాభియాన్ ద్వారా సుమారు ఒకొక్క భవనానికి రూ. 6 లక్షలు మేరకు అంచనాలతో ప్రతిపాదనలు పంపి భవన నిర్మాణాలు ప్రారంభించారు. అయితే సంవత్సరం గడుస్తున్నా నిర్మాణ పనులకు నిధులు మంజూరు కాక పనులు ముందుకు సాగక కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. భవన నిర్మాణం కోసం తెచ్చిన ఇనుము తుప్పుపట్టి పోవడంతో కాట్రాక్టర్ల నిర్లక్ష్యంపై గ్రామస్థులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా త్వరితగతిన నిధులు మంజూరు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై ఎంఈవో ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పశువుల్లంక, అంబటివారి పాఠశాల, ఐ పోలవరం ప్రాథమిక పాఠశాల భవనాల నిర్మాణానికి సర్వశిక్షాభియాన్‌కు అంచనాలు పంపించామని, నిధులు మంజూరు చేస్తే త్వరితగతిన భవన నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు.
కార్తీక దీపారాధన మహోత్సవం ప్రారంభం
రామచంద్రపురం, డిసెంబర్ 4: దక్షిణ కాశి ద్రాక్షారామ గ్రామంలో శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయ బహిర్‌ప్రాంగణం వద్ద నెలకొనియున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి 55వ కార్తీక దీపారాధన మహోత్సవం మంగళవారం ఆధ్యాత్మిక, ఆగమ, విశేష పూజలతో ప్రారంభమైంది. ఆలయంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి విశేష తమలపాకు, గంధ సింధూర అప్పాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తులు తమ గోత్ర నామాలతో నిర్వహించుకున్నారు. సామర్లకోటకు చెందిన శ్రీ చంద్రాభట్ల చింతామణి గణపతి శాస్ర్తీ ఆశీస్సులతో రుత్విక్కులు బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీమన్నారాయణశర్మ సారథ్యంలో విశేష లక్ష తులసి పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి పళ్ల రసాలు, పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హారతి నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. అనంతరం ఉష్ట్ర వాహనంపై శ్రీ స్వామి వారి నగరోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ భీమేశ్వర నాదస్వర బృందం, కోటేశ్వరరావు సన్నాయి మేళం, శ్రీ లక్ష్మీ గణేశ్వర రామడోలు బృందం, శ్రీ సాయి భీమేశ్వర సినీ మ్యూజికల్ బ్యాండ్ మేళం, ఫకీర్ సన్స్, జానకిరామయ్య సన్స్ బ్యాండ్ పార్టీతోపాటు వివిధ కోలాటాలతో శ్రీ స్వామి వారి నగరోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ ప్రసన్నాంజనేయ బాలభక్త సమాజం అధ్యక్షుడు, అన్నవరం శ్రీ సత్యదేవా ట్రస్టుబోర్డు సభ్యుడు నున్న రామచంద్రరావు నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, బాలభక్త సమాజ సభ్యులు, రైస్‌మిల్లర్ల సంఘం సభ్యులు సహకరించడంతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. రైస్‌మిల్లర్ల సంఘం నాయకులు సత్తి సుబ్బారెడ్డి తదితరులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం విశేష రీతిలో అన్నసమారాధన కార్యక్రమం జరిగింది. భక్తులకు అప్పాలు పంచారు. సాయంత్రం నుండి మరిన్ని కార్యక్రమాలు వేడుకగా ప్రారంభించగా ఉత్సాహంగా వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారు.