తూర్పుగోదావరి

భర్త ఇంటి ముందు భార్య ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, డిసెంబర్ 10: ప్రేమించి పెండ్లిచేసుకుని కులం అడ్డు వచ్చిందనే కారణంతో తప్పించుకుని తిరుగుతున్న భర్త ఇంటి ఎదుట భార్య (మహిళ) తన చంటిబిడ్డతో కలసి ధర్నా చేపట్టింది. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం సమయంలో కాకినాడ నగరం జె రామారావుపేటలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక జగన్నాధపురంనకు చెందిన భవాని అనే మహిళను ప్రేమపేరుతో జె రామారావుపేటకు చెందిన దుళ్ల శ్రీను అనే వ్యక్తి దగ్గరయ్యాడు. అప్పటికే విడాకులు తీసుకున్న తల్లిదండ్రులతో ఉంటున్న భవానికి శ్రీను కొంత కాలం ప్రేమపాఠాలు చెప్పి శారీరకంగా దగ్గరయ్యాడు. కొన్ని నెలలుపాటు ఇరువురు మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. భవాని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ అని తెలియడంతో ఆమె నుండి తప్పించుకు తిరగసాగాడు. దీంతో భవాని స్థానిక ఒన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో 2017లో శ్రీను అనే వ్యక్తి తనను ప్రేమించి మోసగించాడని ఫిర్యాదుచేసింది. పోలీస్ స్టేషన్‌లో శ్రీనుపై భవాని ఫిర్యాదుచేయడంతో ఇరువర్గాల పెద్దలు రంగంలోకి దిగడంతో భవానిని శ్రీను వివాహం చేసుకున్నాడు. అనంతరం కొంతకాలం కాపురం చేసిన శ్రీను భార్య భవాని ఆరునెలల గర్భవతిగా ఉన్న సమయంలో భార్యను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. దీంతో భవాని కుటుంబ సభ్యులు, స్థానిక పెద్దలు శ్రీనుతో పంచాయతీ పెట్టగా తాము బీసీ సామాజిక వర్గానికి చెందిన వారమని, భవానీతో కాపురం చేయడానికి తన కుటుంబ సభ్యులు అంగీకరించడంలేదని చెప్పడం జరిగింది. ఈ వివాదాలు నేపధ్యంలో భవాని పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. భవాని తన భర్త శ్రీను మోసంచేశాడిని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటకీ అక్కడ న్యాయం జరగకపోవడంతో తన రెండు నెలలు వయస్సు ఉన్న చంటి బిడ్డతో కలసి సోమవారం మధ్యాహ్నాం సమయంలో జె రామారావుపేటలో ఉన్న భర్త శ్రీను ఇంటి ఎదుట ధర్నా చేపట్టింది. భవానీ ధర్నా చేపట్టడంతో భర్త శ్రీను, అతని కుటుంబ సభ్యులు ఇంటి తాళాలు వేసుకుని మరోచోటుకు వెళ్లిపోయారు. బాధితురాలు భవానికి న్యాయం చేయాలని కోరుతూ ఐద్వా నగర అధ్యక్షురాలు అనంతలక్ష్మి, కార్యదర్శి సుభాషిణి, కార్యకర్తలు ఆమెకు అండగా నిలిచారు. బాధితురాలు భవానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని ఐద్వా నాయకులు తెలిపారు. ఈ విషయమై వన్‌టౌన్ పోలీసులను సంప్రదించగా తమకు ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు.