తూర్పుగోదావరి

విద్యార్థులు తలచుకుంటే సాధించలేనిది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 10: విద్యార్థులు తలచుకుంటే సాధించలేనిది వుండదని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. స్థానిక ఎస్ కె ఆర్ కళాశాల స్థాపించి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాలలో స్వర్ణోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి పట్టుదలతో ముందుకు సాగాలన్నారు. విద్యార్థులు కళాశాల దశలో ఎటువంటి ఇబ్బందులకు లోనుకాకుండా ముందుకు సాగాలన్నారు. తాను ఏమి సాధించామనే విషయంపైనే దృష్టి సారించాలన్నారు. ప్రతీ ఒక్కరూ తల్లిదండ్రులను, ఆయా కుటుంబాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. నచ్చిన పనిని చేసినపుడు ఎంతో సంతృప్తి పొందగలరని, చదువులో రాణించడంతో పాటు మంచి వినయం, విధేయత కలిగి వుండాలన్నారు. మన సత్ఫ్రవర్తనను బట్టే త్వరితగతిన ఉద్యోగాలు కూడా లభిస్తాయన్నారు. విద్యార్ధులు సమాజానికి సేవలు అందించాలన్నారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ విద్యార్ధులు తమ కర్తవ్యాన్ని పూర్తిస్థాయిలో నిర్వహించాలన్నారు. ముందుచూపుతో భవిష్యత్‌కు బాట వేసుకోవాలన్నారు. యువతరం తలచుకుంటే సాధించలేనిది ఉండబోదన్నారు. విద్యార్ధులు సమాజానికి పట్టుగొమ్మలుగా ఉంటూ ముందుకు సాగాలన్నారు. అంతకుముందు కళాశాల తెలుగు అధ్యాపకురాలు అన్నపూర్ణదేవి రచించిన కందుకూరి రాజ్యలక్ష్మి జీవిత చరిత్ర పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ సిఎం సాయికాంత్ వర్మ, అసిస్టెంట్ కలెక్టర్ ఎం జ్ఞాన చందర్, కళాశాల కరస్పాండెంట్ పి పల్లంరాజు, ప్రిన్సిపాల్ ఎన్వీ ఎన్ రత్నకుమారి, తహసిల్దారు టి రాజేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.