తూర్పుగోదావరి

మెడికల్ షాపులపై ‘విజిలెన్స్’ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 10: జిల్లా కేంద్రమైన కాకినాడలోని పలు మెడికల్ షాపులపై సోమవారం విజిలెన్స్ అధికారులు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. రాష్ట్ర విజిలెన్స్ డీజీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు జిల్లా విజిలెన్స్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు ఆధ్వర్యంలో జిల్లాలో పలు మెడికల్ షాపులను విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు.
కాకినాడలోని సర్పవరం జంక్షన్ వద్ద ఆరోగ్య మెడికల్స్‌ను తనిఖీ చేసిన అధికారులు ఫార్మాసిస్ట్ లేకుండా కార్యకలాపాలు నిర్వహించడం గమనించారు. బిల్లులు ఇవ్వకపోవడం, లేబర్ డిపార్టుమెంట్‌కు సంబంధించిన రికార్డులు నిర్వహించకపోవడం గమనించారు. కాకినాడ రామారావుపేటలోని కోస్టల్ మెడికల్స్‌ను తనిఖీ చేసిన అధికారులు ఫార్మాసిస్ట్ అందుబాటులో లేకపోవడం, బిల్లులు ఇవ్వకపోవడంతో పాటు అసలు లేబర్ లైసెన్స్ లేకపోవడాన్ని గమనించారు. నాణ్యత పరీక్షల నిమిత్తం నమూనాలు సేకరించారు. అమలాపురంలోని గడియారస్ధంభం వద్ద గల మోహన్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్‌ను తనిఖీ చేసిన అధికారులు ఫార్మాసిస్ట్ అందుబాటులో లేకపోవడం, లేబర్ డిపార్టుమెంట్ నిబంధనలు పాటించకపోవడం, హెచ్1 స్టాకు రిజిస్టర్ పూర్తిగా లేకపోవడం, బిల్లులు ఇవ్వకపోవడాన్ని గుర్తించారు. అమలాపురంలోని గడియార స్ధంభం వద్ద గల లీలాశ్రీ మెడికల్ అండ్ జనరల్ స్టోర్‌ను తనిఖీ చేసిన అధికారులు అక్కడ కూడా ఫార్మాసిస్ట్ అందుబాటులో లేకపోవడాన్ని గుర్తించారు. హెచ్1 స్టాకు రిజిస్టర్ సక్రమంగా లేకపోవడం, బిల్లులు ఇవ్వకపోవడం గుర్తించారు.
రాజమహేంద్రవరంలోని దేవీచౌక్‌లోని లక్ష్మీశ్రీనివాస మెడికల్స్, చందమామ మెడికల్స్‌ను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో మందులకు బిల్లులు ఇవ్వకపోవడం, లేబర్ డిపార్టుమెంట్ ఉత్తర్వులు పాటించకపోవడం, హెచ్1 స్టాకు రిజిస్టర్ నిర్వహించకపోవడం వంటి లోపాలు గుర్తించారు. ఇందుకు సంబంధించిన నివేదికలు రూపొందించి ఉన్నతాధికారులకు పంపించారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు వై సత్యకిషోర్, టి రామ్మోహన్‌రెడ్డి, బి సాయి రమేష్, పీడీ రత్నకుమార్, జి గోపాలరావు, ఎస్ రామకృష్ణ, జె భార్గవ మహేష్, రంగ కుమార్, షేక్ వల్లీ, విజిలెన్స్ సిబ్బంది, డ్రగ్ ఇనస్పెక్టర్లు వి ఎస్ జ్యోతి, బి అభిప్రియ, బి గోపాలకృష్ణ, లేబర్ శాఖ అధికారులు పాల్గొన్నారు.