తూర్పుగోదావరి

పంచాయతీల్లో మూలుగుతున్న నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలమూరు, డిసెంబర్ 10: పంచాయతీల్లో అభివృద్ధి పనులకు మంజూరైన 14వ ఆర్థిక సంఘం నిధులు లక్షల్లో మూలుగుతున్నాయని, వాటిని అభివృద్ధి పనులకు ఎందుకు ఖర్చు చేయడంలేదని శాసనమండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. మూడు నెలలుగా ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వచ్చిన గ్రామ పాలన వలన ప్రజలకు మేలు జరుగుతుందని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే సహించేది లేదని అధికారులను, పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. సోమవారం స్థానిక మండల పరిషత్ సమావేశం ఎంపీపీ కొత్తపల్లి ధనలక్ష్మి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జిల్లాపరిషత్, మండల ప్రజాపరిషత్‌లకు ప్రస్తుతం నిధుల కొరత వేధిస్తోందన్నారు. ఆ పరిస్థితి పంచాయతీలకు లేదని, అభివృద్ధి పనులు నిర్వహించేందుకు కేంద్రం నుండి నేరుగా పంచాయతీలకు నిధులు విడుదల అవుతున్నాయని అన్నారు. అయితే వాటిని ఖర్చు చేయడంలో పంచాయతీ కార్యదర్శులు, ఆ గ్రామ ప్రత్యేకాధికారులు విఫలమయ్యారని గ్రామాల వారీగా సమీక్షించిన ఆయన దుయ్యబట్టారు. అలాగే మండల సమావేశాలకు రావలసిన ఆయా శాఖల ముఖ్య అధికారులు రాకుండా కింది స్థాయి ఉద్యోగులు వస్తున్నారన్నారు. ఆర్‌అండ్‌బి వంటి ముఖ్య శాఖల అధికారులు కొందరు మండల సమావేశాలకు రాకుండా నిర్ల్యక్ష్యం వహిస్తున్నారన్నారు. అటువంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని ఎంపీడీవో ఎం వెంకట రమణారావును ఆదేశించారు. అలాగే పశుసంవర్ధక శాఖ ఏడీఏ ఓ రామకృష్ణ హాజరుకాకుండా సరైన సమాచారం లేకుండా వచ్చిన జొన్నాడ పశువైద్యునిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పథకం వచ్చినా ఎంపీటీసీ సభ్యులకు తెలియడంలేదని మండల ప్రతిపక్ష నేత రాయుడు లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మండల పరిషత్ పర్యవేక్షణ అధికారి సురేంద్రరైడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2018-19 సంవత్సరానికి ఆదాయం రూ.25,90,70,252లు కాగా వ్యయం రూ.25,89,74,046లుగా నిర్ణయించారు. రూ.96,206లు మిగులు బడ్జెట్‌గాను, 2019-20 సంవత్సరానికి ఆదాయం రూ.27,24,73,093లు కాగా వ్యయం రూ.27,22,42,977లు నిర్ణయించి రూ.2,30,116 మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం పలు శాఖల అభివృద్ధి పనుల నిర్వహణపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ ఈదల సత్యనారాయణ చౌదరి, జడ్పీటీసీ దండంగి మమత, తహసీల్దార్ కె పద్మావతి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘నన్నయ’ డిగ్రీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

రాజమహేంద్రవరం, డిసెంబర్ 10: ఉభయ గోదావరి జిల్లాల్లోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాలలకు సంబంధించిన పరీక్షల టైమ్ టేబుల్‌ను విశ్వవిద్యాలయం కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్ లింగారెడ్డి సోమవారం యూనివర్సిటీలో విడుదల చేశారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ అనుబంధ డిగ్రీ కళాశాలల్లోని క్లాసిక్ స్కీమ్, కామన్ కోర్ స్కీమ్‌లకు సంబంధించిన పరీక్షలు 2019 ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. ప్రధమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాలకు సంబంధించిన బీఏ, బిఏ (ఒకేషనల్), బికామ్, బిఎస్సీ, బీబీఎం, బిసీఎ విద్యార్ధులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా 2012-13 విద్యా సంవత్సరంలో అడ్మిట్ అయిన కామన్ కోర్ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఇదే ఆఖరి అవకాశమన్నారు. కాబట్టి తప్పక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే ప్రస్తుత సెమిస్టర్ సిస్టమ్‌లోని 2,4,6 సెమిస్టర్ పరీక్షలు కూడా 2019 మార్చి 18 నుంచి జరుగుతాయని చెప్పారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్‌ను సంప్రదించాల్సిందిగా సూచించారు.