చిత్తూరు

నెలాఖరుకు జిల్లాకు హంద్రీ-నీవా నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, డిసెంబర్ 10: జిల్లాకు ఈ నెలాఖరులోగా హంద్రీ-నీవా జలాలు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న వెల్లడించారు. సోమవారం చిత్తూరు సచివాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో హంద్రీ-నీవా కాల్వ పనులు దాదాపుగా పూర్తయ్యాయని, పీటీఎం చెరువు పనులను కూడా ఇటీవల పరిశీలించారని, ఈ నెలాఖరులోగా జిల్లాకు ఈ నీరు రావాలన్న సంకల్పంతో ఇంజినీర్లు కూడా పనులు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఆధ్యాత్మిక నగరంగా ప్రసిద్ధి చెందిన తిరుపతిని మరింత అధునీకరించడానికి పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఇందులో భాంగంగా ఇప్పటికే దీపావళి ఉత్సవాలు, నిడ్జమ్ క్రీడలు తదితర కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ఈ నగరంలో తరుచూ భిన్నమైన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈనెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తిరుపతి తారకరామా మైదానంలో రాష్ట్ర టూరిజం శాఖ ద్వారా ఏపీ క్రాప్ట్స్ మేళాను పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు వివరించారు. హస్తకళను ప్రోత్సహించాలన్న సంకల్పంతో దేశంలో వివిధ కళాకారులతో తయారు అయ్యే వస్తువులను ఇందులో ఉంచడంతో పాటు ప్రతి రోజు సాయంత్రాల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలోనూ ఇదే నగరంలో భారీ ఎత్తున ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులో కూడా పలు కార్యక్రమాలకు నాంది పలికామన్నారు. జిల్లాలో యోగాను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకున్నామని, ఇందులో భాగంగా ఈనెల 12వ తేదీన జిల్లాలో పది గ్రామాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే జిల్లా వ్యక్తిగత మరుగు దొడ్లు నిర్మాణం, ఫారం పాండ్స్ , ఉపాధి హామీ తదిరత పథకాలతో జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధిలో జిల్లాను దేశంలోనే ఒక బ్రాండ్‌గా చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల జిల్లాలోని అన్ని వసతి గృహాలపై వార్డన్లతో సమీక్షించామని, ఇందులో అన్ని వసతి గృహాలకు వారం లోగా నీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్మిణాలు, చిన్న చిన్న రిపేర్లు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. పేద విద్యార్థులకు సంబంధించి వసతి గృహాల అభివృద్ధికి దాతలు ముందకు రావాల్సిన అవసం ఉందన్నారు. జిల్లాలో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారు చేయాలన్నదే తమ లక్ష్యమని, ఇందుకు అనేక చర్యలు తీసుకున్నామన్నారు. సందేహం ఉన్న ఓటరు వివరాలను సమగ్రంగా పరిశీలిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 3.52 దరఖాస్తులు రాగా, అందులో ఇప్పటికి సుమారు 16వేల దరఖాస్తుల్లో సక్రమైన వివరాలు లేకపోవడంతో తొలగించామన్నారు. ఓటర్ల జాబితాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రకృతి వ్యవసాయంలో కూడా జిల్లా అగ్రగామిగా ఉందని, దీన్ని మరింతగా ప్రోత్సహించడానికి చర్యలు చేపట్టామని కలెక్టర్ వివరించారు.