తూర్పుగోదావరి

ఇరిగేషన్‌లో క్షేత్రస్థాయి ఉద్యోగ నియామకాలు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధవళేశ్వరం, మే 5: ఇరిగేషన్‌లో క్షేత్రస్థాయి నియామకాలు వెంటనే చేపట్టాలని ఎపి ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్స్ మెయింటినెన్స్ అండ్ ప్రాజెక్టు ఎంప్లారుూస్ అసోసియేషన్ ప్రసిడెంట్ డిఎస్ సుందర్‌సింగ్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఎంప్లారుూస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు టిఎస్ ప్రకాష్ మాట్లాడుతూ అధికారులు స్పందించి కాలయాపన లేకుండా లస్కర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లకు పదోన్నతి కల్పించాలని కోరారు. పివి శాస్ర్తీ మాట్లాడుతూ ఇరిగేషన్ క్షేత్రస్థాయిలో ఇరిగేషన్‌లో 1994 నుండి లస్కర్లు, వర్క్‌ఇన్‌స్పెక్టర్ల నియామకాలు చేపట్టకపోవడం వల్ల సిబ్బందిపై అదనపు భారం పడిందన్నారు. ఇరిగేషన్ సర్కిల్ ప్రధాన కార్యదర్శి వైవివిఎస్ రామభద్రరావు మాట్లాడుతూ ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఇని అనేక పర్యాయాలు ఈ విషయమై కలిసి వినతులు సమర్పించినా అలసత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు డిఎస్ రవికుమార్, వై విష్ణుమూర్తి, అంజయ్య, తోరం సత్యన్నారాయణ, పేరయ్యలింగం, బొక్కా శ్రీమన్నారాయణ, టి శ్రీనివాస్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.