తూర్పుగోదావరి

సిద్ధివినాయకస్వామివారికి రూ.10లక్షల వెండి తాపడం బహూకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయినవిల్లి, డిసెంబర్ 13: ప్రసిద్ధిచెందిన అయినవిల్లి సిద్ధివినాయకస్వామివారికి అయినవిల్లి మండలం అయినవిల్లి వాస్తవ్యులు విళ్ల వంశీయులు అందరూ కలసి సుమారు 22కేజీల వెండితాపడం చేయించడానికి సంకల్పించినట్లు ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. దీని విలువ రూ. 10లక్షలు ఉంటుందని ఈవో తెలిపారు. వెండితాపం తయారీ కోసం అజ్జరం గ్రామానికి చెందిన సిల్వర్ వర్కర్ వేలూరి రత్నకుమార్‌కు ఆర్డర్ ఇవ్వడం జరిగిందని ఈవో తెలిపారు.
108లో మహిళ ప్రసవం
రంగంపేట, డిసెంబర్ 13: మండలంలోని దొడ్డిగుంట గ్రామానికి చెందిన కొల్లపు జూలియమ్మ (22) గురువారం మధ్యాహ్నం రెండ కాన్పు 108 వాహనంలో జరిగింది. దొడ్డిగుంట గ్రామం నుంచి రాజమహేంద్రవరం ప్రసవం నిమిత్తం 108లో తరలిస్తుండగా రంగంపేట సమీపంలో కవలలకు (ఆడ శిశువులు) జన్మనిచ్చింది. తల్లీబిడ్డలను 108 సిబ్బంది ఎన్ శ్రీనివాస్, పి రమేష్ రంగపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఈ శిశువుల్లో ఒకరు 2.5 కేజీలు, మరో శిశువు 2.3 కేజీలు ఉన్నట్టు, తల్లీ పిల్లలు క్షేమంగా ఉన్నట్టు వైద్యాధికారిణి అనూష తెలిపారు. ఇదే మాదిరిగా ఇప్పటి వరకూ 108 వాహనంలో నలుగురు మహిళలకు (కవలలే) ప్రసవించినట్టు ఎన్ శ్రీనివాస్ తెలిపారు.

18,19తేదీల్లో నన్నయలో సైన్స్ అకాడమి సదస్సు

రాజమహేంద్రవరం, డిసెంబర్ 13: జీవ వైవిధ్యం-పర్యావరణ సాంకేతికతపై ఈ నెల 18,19 తేదీల్లో సైన్స్ వార్షిక సదస్సును నిర్వహించనున్నట్టు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య సుంకరి రామకృష్ణారావు తెలిపారు. ఈ సదస్సు బ్రోచర్‌ను వీసీ గురువారం యూనివర్సిటీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ సదస్సును సైన్స్ విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇటీవల కాలంలో శాస్తర్రంగంలో జరిగిన అనేక మార్పులను ప్రముఖ శాస్తవ్రేత్తలు ఈ సదస్సులో తెలియజేస్తారన్నారు. కో ఆర్డినేటర్ డాక్టర్ పి విజయ నిర్మల మాట్లాడుతూ బయోలాజికల్ డైవర్సిటీ డ్ బయో టెక్నాలజీకి సంబంధించిన అనేక నూతన విషయాలు ఈ సదస్సులో విద్యార్ధులకు వివరించడం జరుగుతుందని చెప్పారు. సదస్సుకు కన్వీనర్‌గా బెంగుళూరు యూనివర్సిటీకి చెందిన ఆచార్య మనోహరచారి వ్యవహరిస్తారని, ముఖ్య అతిథులుగా హైదరాబాద్ యూనివర్సిటీ ఆచార్య కె మురళీధర్, ఉస్మానియా యూనివర్సిటీ చార్యా పి కవికిషోర్, శాస్తవ్రేత్త ఆచార్య వి రాజరామ్మోహనరావు హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ ఎ మట్టారెడ్డి, డాక్టర్ కె రమణేశ్వరి, డాక్టర్ డి కళ్యాణి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలతో క్రమశిక్షణ, స్నేహభావంతో నడుచుకోవాలి
*ఐజీపీ రాజు
వై.రామవరం, డిసెంబర్ 13: గిరిజన ప్రాంత ప్రజలతో క్రమశిక్షణ, స్నేహభావంతో నడుచుకోవాలని హైదరాబాదుకు చెందిన సదరన్ సెక్టార్ మరియు జోన్ ఐపీఎస్ అధికారి సిఆర్పీఎఫ్ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(ఐజీపి) జీహెచ్‌పి రాజు అన్నారు. ఆయన గురువారం వై రామవరం పోలీసు స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్‌లో ఉన్న సిఆర్పీఎఫ్42 బెటాలియన్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు తాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు సదరన్ సెక్టార్, జోన్ అధికారిగా వ్యవహరిస్తున్నానన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలోను 3 బెటాలియన్ల వంతున 3 రాష్ట్రాల్లో 9 బెటాలియన్లు తమ ఆధీనంలోనే ఉంటాయన్నారు. దీంట్లో భాగంగానే వై రామవరం పోలీసులు విభాగంలో ఇన్స్‌పెక్షన్ నిర్వహణ కోసమే తాను వచ్చానన్నారు. పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న 1000(వెయ్యి) మంది గిరిజన యువతకు ఉచిత శిక్షణ ఇచ్చామన్నారు. శాంతి భద్రతలు పరిరక్షణలో భాగంగా సివిల్ పోలీసులకు సపోర్టుగా నిలవడమే తమ సిబ్బంది తమ సిబ్బంది బాధ్యత అన్నారు. గిరిజనాభివృద్ధిలో పాలుపంచుకుంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. మావోయిస్టు కార్యకలాపాలపై సిబ్బందిని ఆరా తీసారు. సిబ్బంది ప్రతీ ఒక్కరిని పలకరించి, వారి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనాభివృద్ధిలో భాగంగా ఈ ఏడాది గిరిజన ప్రాంతంలో నిర్వహించిన సివిక్ యాక్షన్ ప్రోగ్రాంలపై ఆరా తీసారు. స్టేషన్ ఆవరణలో ఉన్న సిఆర్పీఎఫ్ పోలీసుల భద్రతా ఏర్పాట్లును తనికీ చేసారు. విధుల నిర్వహణలో అప్రమత్తతపై సిబ్బందికి తగు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈకార్యక్రమంలో సిఆర్పీఎఫ్ ఎఫ్42 బెటాలియన్ కమాండెంట్ రామకిషన్, సెకండన్ కమాండెంట్ అశోక్‌కుమార్, అసిస్టెంట్ కమాండెంట్ క్లారెన్స్ వి.ఎఫ్., రంపచోడవరం ఏఎస్పీ రాహుల్ దేవ్ సింగ్, అడ్డతీగల సిఐ ఎ.మరళీకృష్ణ, స్థానిక ఎస్సై ఎన్.సతీష్‌బాబు, సిఆర్పీఎఫ్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.