తూర్పుగోదావరి

ఘనంగా ప్రారంభమైన షష్ఠి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిక్కవోలు, డిసెంబర్ 13: బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి ఉత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం రాత్రి తెల్లవారితే గురువారం 2.22 గంటలకు స్వామివారి తీర్థపు బిందె సేవతో షష్ఠి ఉత్సవాలు ఆరంభమయ్యాయి. తెల్లవారుఝాము నుంచే భక్తులు గోదావరి కాలువలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. స్వామివారి పల్లకీ సేవలో భక్తులు పాల్గొన్నారు. అలాగే మండపంలో వేచియున్న భక్తుల కోసం బ్యాండ్ పార్టీలు, కచేరీలు వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సంతానం లేని మహిళలు స్వామివారి గర్భాలయంలో ఉన్న పుట్టపై ఉంచిన నాగుల చీరలను ధరించి ఆలయం వెనుక నిద్రించారు. ఇలా చేయడం వలన సంతానంలేని వారికి స్వామివారు కలలో సాక్షాత్కరించి సంతానాన్ని ప్రసాదిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో అధిక సంఖ్యలో మహిళలు నాగుల చీరను ధరించి ఆలయం వెనుక నిద్రించారు. వచ్చిన భక్తులకు గ్రామంలోని స్వచ్ఛంద సంస్థ శ్రీ షిరిడీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు చేశారు. సుమారు 6వేల మందికి భోజన సౌకర్యం కల్పించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఫ్రెండ్లీ బాయస్ యూత్, స్నేహ యూత్ తదితర స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు చిన్నారులకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అలాగే ఫిషర్‌మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు. రాజారావుపేటలోని తూర్పు కాపుల రామాలయం వద్ద సమీప గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 4నుంచి 6 గంటల వరకు పగటి పూట బాణాసంచా కాల్పులు భక్తులను ఆకర్షించాయి. స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వైసీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్‌ఛార్జి మార్గాని భరత్, ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, వైసీపీ నాయకులు జంగా వీర వెంకట సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.
గృహ సముదాయాలను పరిశీలించిన కలెక్టర్
రామచంద్రపురం, డిసెంబర్ 13: త్వరలో గృహప్రవేశాలు చేసేందుకు సిద్ధంగా ఉన్న స్థానిక మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డు కొత్తూరులో 1088 జీప్లస్-2 గృహసముదాయాలను జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ కార్తికేయ మిశ్రా గురువారం పరిశీలించారు. రామచంద్రపురానికి చేరుకున్న ఆయన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రీరాజాకాకర్లపూడి రాజగోపాల నర్సరాజు (గోపాల్‌బాబు)తోపాటు టిడ్కో ఇంజనీరింగ్ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి గృహాల పరిశీలన చేశారు. ఈసందర్భంగా గృహ సముదాయాల ప్రాజెక్టు పట్టాన్ని పరిశీలించి, ఎక్కడెక్కడ ఏం నిర్మించాలో దశ, దిశా నిర్దేశం చేశారు. కనీస ప్రాథమిక సౌకర్యాల కల్పన విషయంలో తీసుకున్న చర్యలపై ఆయన టిడ్కో ఎస్‌ఈ బి శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. పచ్చదనం-పరిశుభ్రత విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ వహించవద్దని, కాకినాడ నగరంలో నిర్మించే ప్రతీ ప్రదేశంలోనూ ఆహ్లాదకర వాతావరణంలో పార్కులు, తదితరాల నిర్మాణానికి శ్రద్ధ చూపిస్తున్నట్టు తెలిపారు. అదేవిధానాన్ని రామచంద్రపురంలో కూడా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇప్పటికిప్పుడు గృహాల్లో గృహయజమానులు చేరినట్టయితే తాగునీటి వసతి ఏమిటని అడగ్గా, సంప్ నిర్మాణం పూర్తవుతుందని కలెక్టర్‌కు తెలిపారు. ఎప్పటిలోగా పూర్తవుతుందని కలెక్టర్ ప్రశ్నించగా, ఆ పనులను కూడా పరిశీలించి వద్దామని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సూచించగా, సంప్ నిర్మాణ ప్రదేశం వద్దకు వెళ్లారు. నిర్మితమవుతున్న సంప్ పరిస్థితులను జిల్లా కలెక్టర్ చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో ఆర్డీవో ఎన్ రాజశేఖర్, తహసీల్దార్ పైడి చిన్నారావు, ఎంపీడీవో పీవీవీ సత్యనారాయణమూర్తి, ఆర్‌ఐ నాయుడు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ మేడిశెట్టి సూర్యనారాయణ, మాజీ ఛైర్మన్ కొమ్మన నాగేశ్వరరావు, ఏఎంసీ ఛైర్మన్ కొమరిన వీర్రాజు, మాజీ ఛైర్మన్ గరిగిపాటి సూర్యనారాయణమూర్తి, టీడీపీ నాయకులు నందుల రాజు, కంచుమర్తి బాబూరావు, పెదపాటి సుభాష్‌చంద్రబోస్, మున్సిపల్ కౌన్సిలర్లు వైట్ల సూర్యప్రకాశరావు, దిగుమర్తి వీరబాబు, టిడ్కో ఏఈ దుగ్గిరాల శ్రీదేవి, డీఈ టి వరదరాజు, ఈఈ పి రీటా, మున్సిపల్ డీఈ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా రామచంద్రపురంలోని బంగ్లాతోట పరిశీలన చేయాలనుకున్నప్పటికీ సమయాభావం వల్ల కలెక్టర్ ఆ ప్రదేశాలను పరిశీలించలేదు.