తూర్పుగోదావరి

సీవోల ఇష్టారాజ్యం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 13: రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో మెప్మా సీవో (కమ్యూనిటీ ఆర్గనైజర్లు) ఇష్టారాజ్యంగా నడుస్తోందని, వారు ఆడిందే ఆట పాడిందే పాటగా డ్వాక్వా సంఘాల పాలన సాగుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
రాజమహేంద్రవరం నగరంలో డ్వాక్వా సంఘాలకు ఇచ్చే కుట్టు మిషన్లూ, శిక్షణ సీవోల నిర్వాకం కారణంగా దక్కడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 2014 నుంచి ఇప్పటి వరకు రాజమహేంద్రవరం అర్బన్‌లో డ్వాక్వా సంఘాలకు కుట్టు మిషన్ల పంపిణీ జరగలేదు. రాజమహేంద్రవరం అర్బన్‌లో దాదాపు వంద సమైక్యలు ఉన్నాయి. ఒక్కో సమైక్యకు సుమారు 100 కుట్టు మిషన్లు పంపిణీ జరగాల్సి ఉంది. ఒక్కో సమైక్యలో వంద నుంచి మూడు వందల మంది సభ్యులుంటారు. అయితే 2014 నుంచి పంపిణీ చేయాల్సిన కుట్టు మిషన్లు మొత్తం ఒకే సారి పెద్ద ఎత్తున హడావిడి చేసి పంపిణీ చేసేందుకు ఒక నాయకుడి కనుసన్నల్లో సీవోలు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది.
నగరంలో కుట్టు మిషన్లు ఇప్పటి వరకు ఎందుకు పంపిణీ చేయలేదనే విషయం ఆఖరికి ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్ళడంతో ఆఖరికి తాజాగా పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో మెప్మా డైరెక్టర్ చినతాతాలు హుటాహుటిన రాజమహేంద్రవరం వచ్చి సెప్టెంబర్‌లో పీడీ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌లో సమావేశాన్ని నిర్వహించి సీవోలను కుట్టుమిషన్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఇందుకు రాజకీయ కారణాలేమైనా ఉన్నాయా, కుట్టు మిషన్ల పంపిణీకి డ్వాక్రా సంఘాలను ఎందుకు ఎంపిక చేయలేదని సీవోలను నిలదీశారు. రెండు నెలల్లో ప్రతీ డివిజన్‌లో ఒక్కో సమైక్య నుంచి ఆసక్తిగల వారిని ఎంపిక చేసి జాబితా ఇవ్వాలని ఆదేశించారు. అయితే నేటికీ మహిళా సంఘాలకు తెలియపర్చకుండా సీవోలు చక్రం తిప్పుతున్నారని ఆరోపణలు విన్పిస్తున్నాయి.
దీనితో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను డ్వాక్వా సంఘాలకు చేర్చేందుకు సాధికార మిత్రలను ఏర్పాటు చేశారు. 35 కుటుంబాలకు ఒక్కో సాధికార మిత్ర చొప్పున ఎంపిక చేసి వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పధకాలు తెలియపర్చాలని సీఎం ఆదేశం. కానీ సీవోలు మాత్రం ఆడిందే ఆట, పాడిందే పాటగా ఉంది. కుట్టు మిషన్ల గురించి అడిగిన మహిళలకు వెళ్ళి ముఖ్యమంత్రిని అడగండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని డ్వాక్వా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతీ నెలా 21న విధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాధికారమిత్రలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఇందులో సీవోలు సాధికార మిత్రలకు బదులు ఆర్పీ(రీసోర్స్‌పర్సన్లు)లను కూర్చోబెడుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం అమలు చేస్తున్న 128 పధకాల గురించి సాధికార మిత్రలు డ్వాక్వా సంఘాలకు తెలియజేయాల్సి వుంది. అన్నీ విషయాలూ తెలిసిన వారైతే సీవోల ఆటలు సాగవని తమ చెప్పు చేతల్లో, చెప్పినట్టుగా వినేవారిని ఎంపిక చేసి ఆర్పీలను వీడియో కాన్ఫరెన్స్‌లో కూర్చోబెడుతున్నారని తెలుస్తోంది.
ఇదిలా వుండగా గత ప్రభుత్వ హయాంలో రుణ మాఫీ వడ్డీ నిమిత్తం 2012 నుంచి ఇప్పటి వరకు రూ.580 కోట్లు విడుదల చేశారు. రూ. లక్ష నుంచి రెండు లక్షల రుణం తీసుకున్నవారికి వడ్డీ పొదుపు ఖాతాల్లో జమ చేయాల్సి వుంది. ఈ మేరకు అర్బన్‌కు రూ.10 కోట్లు రావాల్సి ఉంది. ఒక్కో గ్రూపునకు రూ.25వేల నుంచి రూ.50వేల వరకు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు వడ్డీ మాఫీ డ్వాక్వా సంఘాలకు పడలేదని తెలిసింది. దీనితో పాటు డ్వాక్రా సంఘాలకు ఏదైనా శిక్షణ కల్పిస్తే శిక్షణ నిమిత్తం రూ.50 వేలు ఒక్కో సభ్యురాలికి ఇవ్వాల్సి వుంది. అదీ దక్కడం లేదంటున్నారు. గ్రూపు డేటా తయారికీ ఒక్కో సభ్యురాలికి రూ.50లు ఇవ్వాల్సి ఉంది. సీవోల నిర్వాకం వల్ల డ్వాకా సంఘాలకు ఎటువంటి శిక్షణ అందడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.