తూర్పుగోదావరి

ధాన్యం విక్రయించిన రైతులకు 669.98కోట్లు చెల్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, డిసెంబర్ 13: జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం విక్రయించిన 40వేల 836మంది రైతులకు 669.98కోట్ల రూపాయల సొమ్మును చెల్లించామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ మల్లిఖార్జున తెలిపారు. ఈఖరీఫ్ సీజన్‌కు రైతుల నుండి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి జిల్లా వ్యాప్తంగా 312్ధన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. గురువారం నాటికి జిల్లాలో 40వేల 836 మంది రైతుల నుండి 3లక్షల 82వేల 838.80 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ద్వారా కొనుగోలుచేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం విక్రయించి రైతులకు 669.98కోట్ల రూపాయల సొమ్మును చెల్లించామన్నారు. ధాన్యం కొనుగోలుచేసిన 27వేల 945మంది రైతులకు 48గంటలలోపు 442.73కోట్ల ధాన్యం సొమ్మును వారి బ్యాంకు ఖాతాలో జమచేశామని జేసి మల్లిఖార్జున పేర్కొన్నారు. మరో 8వేల 702మంది రైతులకు ధాన్యం కొనుగోలుచేసిన వారం రోజుల లోపు 143.99కోట్ల ధాన్యం సొమ్ము వారి బ్యాంకు ఖాతాలో జమచేశామని చెప్పారు. రాష్ట్రంలోనే మొదటి సారిగా మన జిల్లాలో గత ఖరీఫ్ 2017-18సీజన్ నుండి పంట కల్లం వద్దనే ధాన్యం కొనుగోలు అను నినాదము ప్రవేశపెట్టామన్నారు. అదే విధంగా ప్రస్తుత ఖరీఫ్ 2018-19సీజనులో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ట్యాబులను వినియోగించి పంట కల్లం వద్దనే ధాన్యం కొనుగోలు విధానాన్ని ప్రారంభించామని ఆయన తెలిపారు. రైతులు పండించిన ధాన్యం సిద్దంచేసిన తరువాత ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఫోన్‌చేసి వారి వివరాలను తెలియజేస్తే ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బంది తేమ నిర్ధారణ యంత్రాన్ని పంట కల్లం వద్దకు తీసుకువస్తారన్నారు. సిబ్బంది కల్లం వద్దనే ధాన్యం తేమ శాతాన్ని నిర్ధారించి, ధాన్యంలో ఉన్న తేమ శాతంను దృవీకరించి దృవీకరణ మంజూరుచేస్తారని తెలిపారు. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యం నాణ్యత ఉంటే కల్లం వద్దనే నూతనంగా ప్రవేశపెట్టిన ట్యాబులను వినియోగించి ధాన్యాన్ని కొనుగోలుచేయడం జరుగుతుందని జేసి మల్లిఖార్జున చెప్పారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుకు రశీదును ప్రింట్‌చేసి ఇస్తారని, ఆవిధంగా కొనుగోలుచేసిన ధాన్యంను సంబంధిత రైసు మిల్లులకు పంటకల్లం నుండి రవాణాచేయాడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ఈవిధంగా చేయడం వలన రైతులు పండించిన ధాన్యంకు సకాలంలో ప్రభుత్వం మద్దతు ధరను అందించుట జరిగుతుందని వివరించారు. రైతులు తాము పండించిన ధాన్యంను కొనుగోలు కేంద్రాల వరకు తీసుకువెల్లవలసిన అవసరం ఉండదన్నారు. ఈవిషయంలో ఏవిధమైన ఇబ్బందులు ఎదుర్కొన్న జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 0884-2354341కు ఉదయం 8గంటల నుండి రాత్రి 8గంటలలోపు పిర్యాదు చేయాలని రైతులకు జేసి మల్లిఖార్జున విజ్ఞప్తి చేశారు. జల్లాలో ఉన్న రైతులు అందరూ జిల్లా యంత్రాంగం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం విక్రయించి ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలని కోరారు.

తుపానుపై పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
*ఎస్పీ విశాల్ గున్ని
కాకినాడ సిటీ, డిసెంబర్ 13: జిల్లాలో తీరం వెంబడి ఉన్న పోలీసు స్టేషన్లకు చెందిన సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని ఆదేశించారు. ఈ నెల 15,16 తేదీల్లో తుపాను ప్రభావం జిల్లాపై తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో తుపాను కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా పోలీసు సిబ్బంది తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై ఆయన జిల్లా పోలీసు కార్యాలయం నుంచి గురువారం మధ్యాహ్నం డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో వైర్‌లెస్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పోలీసు, రెవెన్యూ సిబ్బందితో కలిసి తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్నారు. ముఖ్యంగా స్థానికంగా ఉన్న సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుని సహాయ కార్యక్రమాలకు అవసరమైన సామాగ్రిని ముందుగా సమకూర్చుకోవాలని ఆయన ఆదేశించారు. పోలీసు అధికారులు, సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారుల ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఎస్సైలు, సీఐలు తమ పరిధిలో జేసీబీలు, పొక్లయినర్లను రెండేసి చొప్పున సమకూర్చుకుని, వాటిని అందుబాటులో ఉంచుకోవాలని తెలియజేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ ప్రజలకు తుపాను పట్ల అవగాహన కల్పించి అవసరమైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాటుచేయాలని పోలీసు అధికారులకు ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. తుపాను ప్రభావం కారణంగా ఎక్కడైనా చెట్లు రహదారులపై కూలితే రవాణాకు అంతరాయం లేకుండా ముందుగా రెవెన్యూ అధికారులతో అనుసంధానమై ఉడ్ కటింగ్ మిషన్స్‌ను సమకూర్చుకోవాలని వివరించారు. తుపాను షెల్టర్స్ ఎక్కడ ఏర్పాటుచేస్తున్నారనే వివరాలను రెవెన్యూ అధికారుల నుంచి తెలుసుకుని వారితో కలిసి సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ప్రజలకు తుపాను సమాచారాన్ని లౌడ్ స్పీకర్లు, వాట్సప్, వివిధ రకాల ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేస్తూ పోలీస్ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. తుపాను సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున సిబ్బంది తమకు కావాల్సిన రెయిన్‌కోట్, టార్చ్‌లైట్స్, రోప్స్ తదితర సామాగ్రిన్ని సిద్ధం చేసుకుని తమ వద్ద ఉంచుకోవాలన్నారు. జిల్లాలో ఎంతటి బలమైన తుపాను సంభవించిన దానిని ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అయితే పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు ఇచ్చే సూచనలు తప్పనిసరిగా పాటించి సిబ్బంది తుఫాను సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఎస్పీ విశాల్ గున్ని స్పష్టం చేశారు.