తూర్పుగోదావరి

ఇతర రాష్ట్రాల నుంఢి గేదెలను కొనుగోలు చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, డిసెంబర్ 14: జిల్లాలో 2016-17, 2017-18 సంవత్సరాలకు గేదేల యూనిట్లు మంజూరైన రైతులు తప్పనిసరిగా ఇతర రాష్ట్రాల నుండి గేదెలను కొనుగోలు చేయకుంటే, బ్యాంక్‌లు రుణాలు ఇవ్వవని, తప్పనిసరిగా సూచించిన రాష్ట్రాల నుండి కొనుగోలు చేయాల్సిందేనని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్‌టి శ్రీనివాసరావు చెప్పారు. సామర్లకోట ఏరియా పశువుల ఆసుపత్రిలో శుక్రవారం ఆత్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత ఈ శిబిరాన్ని సామర్లకోట మండల రైతు సంఘం అద్యక్షుడు కంటే జగదీష్‌మోహన్ (బాబు) ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన పశువుల ఆరోగ్య అవగాహన సదస్సులో జేడీ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత రెండేళ్లుగా పశువులు కొనుగోలుపై ఏర్పడిన సందిగ్దత వల్ల రైతులు మంజూరైన సబ్సిడీని వినియోగించులేకపోయారని, తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలతో హర్యానా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుండి పశువులను కొనుగోలు చేస్తే పాల ఉత్పత్తులు బాగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఇతర రాష్ట్రాల నుండి పశువులు కొనుగోలు చేసి రాజమండ్రిలో పరీక్షా కేంద్రంలో 10 రోజులపాటు పరీక్షించి, రైతులకు పాడి పశువుల యాజమాన్యంపై శిక్షణలు ఇచ్చి తిరిగి వారికి అప్పగించడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులైన రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని పాల ఉత్పత్తులు పెంపునకు సహకరించాలని జేడీ విజ్ఞప్తి చేశారు. అలాగే ఉపాధి హమీ పధకం ద్వారా ఊరూరా పశుగ్రాస క్షేత్రాల ఏర్పాటు నిర్వహణ, పశువుల కొనుగోలు రుణాలు సద్వినియోగం, మేలైన పశువుల యాజమాన్యం తదితర అంశాలపై జేడీ శ్రీనివాసరావు రైతులకు అవగాహన కల్పించారు. సభలో విబిఆర్‌ఐ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ మాట్లాడుతూ సకాలంలో పశువులకు టీకాలు వేయించాలని, గొంతువాపు నట్టల నివారణ టీకాలు సక్రమంగా వేయుట ద్వారా, మేలైన పశు పోషణ పద్దతుల ద్వారా పాల దిగుబడి పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య ఆరోగ్య శిబిరంలో సుమారు 100 పశువులకు వైద్య పరీక్షలు చేపట్టి, రూ.10వేలు విలువగల మందులను రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే 150 గొర్రెలకు నట్టల నివారణ వ్యాక్సిన్‌లు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట విబిఆర్‌ఐ (వెటర్నరీ బయోలాజికల్ రిసెర్చి ఇనిస్టిట్యూట్) జాయింట్ డైరెక్టర్ అనూరాధ, వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు డాక్టర్ వై శ్రీనివాసరావు, డాక్టర్ పివి వరప్రసాదరావు, డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మినారాయణ, గొర్రెల విభాగం ఎడి అంబేద్కర్, విబిఆర్‌ఐ ఎడి రామ్ ప్రసాద్, పశువైద్యుడు డాక్టర్ మనోజ్ కుమార్, రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
విద్యార్థులు ఓటుహక్కు పవిత్రతను తెలుసుకోవాలి: కలెక్టర్
కాకినాడ సిటీ, డిసెంబర్ 14: విద్యార్థులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటహక్కు పవిత్రతపై తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పిలుపునిచ్చారు. ఈనెల 22వ తేదీన కాకినాడ నగరం జేఎన్‌టీయూకేలో నిర్వహించనున్న జ్ఞానభేరి సదస్సుకు రన్ అప్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు క్విజ్ పోటీల ఫైనల్స్‌ను నిర్వహించారు. ఈ క్విజ్ పోటీలకు కలెక్టర్ మిశ్రా స్వయంగా క్విజ్ మాస్టర్‌గా వ్యవహరించి కార్యక్రమాన్ని ఆధ్యంతం ఉత్సాహభరింతా నిర్వహించారు. డివిజన్‌ల స్థాయిలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో విజేతల నుండి ఇద్దరేసి విద్యార్థుల టీములు ఏడుడివిజన్ల నుండి ఈ ఫైనల్స్‌లో పాల్గొన్నాయి. కాకినాడ డివిజన్ తరపున కాకినాడ వాకలపూడి హంసవాహిని విద్యాలయం విద్యార్థులు ఎం రతన్, పి సాయిధీరజ్ విద్యార్థులు పాల్గొన్నారు. రాజమండ్రి డివిజన్ తరపున సూర్యదీప్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థి జి సాయి అభినయ్, గోకవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని యామిని, రాజమండ్రి డివిజన్ తరపున భాష్యం ఇంగ్లీష్‌మీడియం హైస్కూల్ విద్యార్థులు ప్రశాంత్ పటేల్, పి సమీష్ పాల్గొన్నారు. అదే విధంగా అమలాపురం డివిజన్ నుండి గొల్లవిల్లి జెడ్పీ ఉన్నతపాఠశాల విద్యార్థులు యం హారిక, వై భవాని, పెద్దాపురం డివిజన్ నుండి ఇందుకూరిపేట జెడ్పీ ఉన్నతపాఠశాల విద్యార్థిని ఆర్ నవ్యశ్రీదేవి, రంపచోడవరం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థి సాయిప్రసాద్‌రెడ్డి, ఎటపాక డివిజన్ నుండి చింతూరు జడ్పీ ఉన్నతపాఠశాల విద్యార్థులు బి భవాని, కె జ్ఞావలు పాల్గొన్నారు. ఓటు సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్(స్వీప్), ఎన్నికలు ప్రధానాంశంగా రాజ్యాంగ అవగాహన, భారతీయ కళలు, సంస్కృతి, వారసత్వం అంశాలపై ప్రశ్నావళితో ఆరు రౌండ్లుగా క్విజ్‌ను కలెక్టర్ కార్తికేయ మిశ్రా నిర్వహించారు. మొదటి రౌండ్‌లో జనరల్ నాలెడ్జ్, రెండవ రౌండులో ఎలక్షన్స్, 3వ రౌండ్‌లో ఇండియన్ హెరిటేజ్, 4వ రౌండ్‌లో సెలక్టీవ్ బ్యాగ్ నుండి ఎంపిక చేసుకున్న అంశం, 5వ రౌండ్‌లో ఆడియో విజువల్ ప్రశ్నలు, 6వ రౌండ్‌లో రాపిడ్‌ఫైర్ పశ్నావళితో ఆయన క్విజ్‌ను నిర్వహించారు. మొత్తం ఆరు రౌండ్‌లు ముగిసే సరికి 65 పాయింట్లతో రామచంద్రపురం డివిజన్ టీమ్ ప్రధమ స్థానంలోను, 45 పాయింట్లతో రాజమండ్రి డివిజన్ టీమ్ రెండవ స్థానంలో నిలవగా, కాకినాడ, రంపచోడవరం, పెద్దాపురం డివిజన్‌ల టీమ్‌లు 40పాయింట్లతో మూడవ స్థానంలో టై అయ్యాయి. టైబ్రేక్ క్వశ్చన్ అంశంలో పెద్దాపురం డివిజన్ టీమ్ సరైన సమాదానాలు తెలిపి తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. క్విజ్ ఫైనల్‌లో విజేతలకు జిల్లా కలెక్టర్ మిశ్రా, ఇంటాక్ కాకినాడ చాప్టర్ అధ్యక్షులు ఎల్ శేషుకుమారి, కన్వీనర్ వివిఎల్‌ఎన్ మూర్తి, సభ్యులు ఎంవి లక్ష్మణరావు, భరతలక్ష్మి ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సెట్రాజ్ సీఈవో ఎస్ మల్లిబాబు, డీఈవో ఎస్ అబ్రహం, ఎస్‌ఎస్‌ఎ పీవో ఎం శేషగిరి, సాంఘిక సంక్షేమశాఖ డీడీ ఎంఎస్ శోభారాణి, బీసీ సంక్షేమశాఖ డీడీ చినబాబు, సమాచారశాఖ డీడీ ఎం ఫ్రాన్సిస్, విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
18, 19న నన్నయలో పీహెచ్‌డీ ఇంటర్వ్యూలు
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, డిసెంబర్ 14: ఏపీ ఆర్ సెట్-2108లో అర్హత పొందిన విద్యార్థులకు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఫుల్‌టైమ్ పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం ఈ నెల 18,19 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ టేకి తెలిపారు. శుక్రవారం విశ్వవిద్యాలయంలోని 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించిన పీహెచ్‌డీ ఇంటర్వ్యూల వివరాలను రిజిస్ట్రార్ తెలియజేశారు. పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం క్యాంపస్‌లో 18,19 తేదీల్లో వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 18న కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్, ఇంగ్లీషు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ వర్క్, సైకాలజీ, తెలుగు విభాగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు. 19న మ్యాథ్‌మెటిక్స్, బోటనీ, జియాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జూయాలజీ, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాల వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. అర్హత, ఆసక్తి వున్న అభ్యుర్థులు ఇంటర్వ్యూ షెడ్యూల్ ఆధారంగా హాజరు కావాలని తెలిపారు. ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్ధులు ఐడీ ఆధారం, హాల్ టికెట్, ర్యాంక్ కార్డులను తప్పక తీసుకురావాలని చెప్పారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్‌ను సంప్రదించాల్సిందిగా సూచించారు.
కాకినాడ ఆర్డీవోగా రాజకుమారి
కాకినాడ, డిసెంబర్ 14: కాకినాడ ఆర్డీవోగా జి రాజకుమారి బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఆర్డీవో కార్యాలయంలో ఆమె సంతకం చేశారు. రాజకుమారి ఇప్పటివరకు కాకినాడలో డ్వామా పీడీగా బాధ్యతలు చేపట్టి బదిలీపై ఆర్డీవోగా వచ్చారు. గత నవంబర్‌లో ఆమెకు బదిలీ అయినా సుమారు నెల రోజుల తర్వాత ఆర్డీవోగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను గతంలో విజయనగరం, పాడేరులలో ఆర్డీవోగా పనిచేశానని ఇది మూడోసారి ఆర్డీవోగా బాధ్యతలను తీసుకున్నట్లు చెప్పారు. రెవెన్యూ డివిజన్ల ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఆమెకు కాకినాడ ఆర్డీవో పరిధిలో ఉన్న తహసీల్దార్లు పుష్పగుచ్చంతో అభినందనలు తెలిపారు. కాకినాడ ఆర్డీవోగా పనిచేసిన ఎల్ రఘుబాబు పాలకొండకు బదిలీ అయ్యారు. అనంతరం రాజకుమారి తుపాన్ ప్రకటించిన నేపధ్యంలో దానిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన విషయాలపై చర్చించారు

జై ఆంధ్రా స్ఫూర్తి ప్రదాతల విగ్రహాలతో స్మృతివనం ఏర్పాటు చేయాలి
ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, డిసెంబర్ 14: విగ్రహ మానసిక రోగుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కొత్త రాష్ట్ర ఏర్పడిన తర్వాత నుంచి చంద్రబాబు ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిని దిగజారుస్తున్నారని ఒక ప్రకటనలో విమర్శించారు. అమరావతి వద్ద నీరుకొండపై ఎన్టీఆర్ విగ్రహం పేరుతో ఒక్క విగ్రహానికే రూ.155 కోట్లు, భవన నిర్మాణానికి రూ.112.5 కోట్లు ఖర్చు చేయాలనుకోవడం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినట్టేనని ఆరోపించారు. పర్యాటక అభివృద్ధి ముసుగులో అశాస్ర్తియమైన చారిత్రక స్థానాన్ని తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకుని రాజకీయ స్వప్రయోజనాలు పొందడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మేడా శ్రీనివాస్ ఆరోపించారు. జై ఆంధ్రా ఉద్యమ స్ఫూర్తిదాతలైన తెనే్నటి విశ్వనాధం, గౌతు లచ్చన్న, కాకాని వెంకటరత్నం తదితరుల కాంస్య విగ్రహాలను అధికారికంగా ఏర్పాటు చేసి ఆ మొత్తం ప్రాజెక్టును జై ఆంధ్రా అమరవీరుల స్మృతివనంగా పర్యాటకంగా అభివృద్ధిపర్చడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆర్పీసీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

‘కందుకూరి కళా పరిషత్’ జాతీయ స్థాయి నాటిక పోటీలు
తొలి ప్రదర్శనగా కరీంనగర్ సమర్పణ ‘దొంగలు’ నాటిక

రాజమహేంద్రవరం, డిసెంబర్ 14: సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు నడయాడిన పుట్టిన గడ్డ రాజమహేంద్రవరంలో సీఎంఆర్ కందుకూరి వీరేశలింగం కళా పరిషత్ ఆవిర్భవించింది. తొలి నాటక ప్రయోక్త కందుకూరి వీరేశలింగం పంతులు స్ఫూర్తిగా తొలి సారిగా కందుకూరి వీరేశలింగం కళాపరిషత్ జాతీయ స్థాయి నాటిక పోటీలను రాజమహేంద్రవరం శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సంస్కృతి సమితి సౌజన్యంతో మూడు రోజుల పాటు జరగనున్న సీఎంఆర్ కందుకూరి వీరేశలింగం కళాపరిషత్ జాతీయ స్థాయి నాటిక పోటీలను రాజమహేంద్రవరం నగర మేయర్ పంతం రజనీ శేషసాయి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రారంభ సభలో మేయర్ పంతం రజనీ శేషసాయి ప్రసంగిస్తూ తొలి నాటక కర్త కందుకూరి వీరేశలింగం స్ఫూర్తిగా ఆయన పేరుతో కళాపరిషత్ ఏర్పాటు చేసి తొలి సారిగా జాతీయ స్థాయి నాటిక పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక నిలయమై, కళల కాణాచి అయిన రాజమహేంద్రవరంలో నాటిక పోటీలు నిర్వహించడం స్ఫూర్తి దాయకమన్నారు. ఎంతో మంది కళాకారులు రాజమహేంద్రవరంలో కీర్తి పతాకాలని, చలన, టీవీ రంగాలకు పుట్టినిల్లయిన నాటక రంగాన్ని సంరక్షించుకోవాలన్నారు. అనంతరం శ్రీ ఉమా నృత్యనికేతన్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో స్వాగత నృత్య ప్రదర్శనతో పోటీలు ప్రారంభించారు. తొలి రోజు మొదటి ప్రదర్శనగా చైతన్య కళాభారతి కరీంనగర్ వారి దొంగలు నాటిక ప్రదర్శించారు. ఈ నాటికను మూల రచన తులసీ బాలకృష్ణ, నాటకీకరణ పి శివరామ్, దర్శకత్వం మంచాల రమేష్ వహించారు. మానవత్వ విలువలు, ఆర్థిక విలువల మధ్య కధాంశంగా ఈ దొంగలు నాటిక సందేశాత్మకంగా రక్తికట్టించింది.