తూర్పుగోదావరి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అర్చకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, డిసెంబర్ 14: రామచంద్రపురం పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అర్చకునిగా పనిచేస్తున్న పాణింగిపల్లి ఫణికుమారాచార్యులు గురువారం అర్ధరాత్రి మృతిచెందారు. పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆయన గత మూడు రోజులుగా కాకినాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. శుక్రవారం ఉదయం ఆ విషయం రామచంద్రపురంలో కలకలం సృస్టిస్తున్న సమయంలో పోలీసులు ఆలయ ధర్మకర్తగా వ్యవహరిస్తున్న చిలుకూరి వీర వెంకట సత్యనారాయణను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు రామచంద్రపురం తరలివచ్చారు. స్థానిక శ్రీ అగస్తేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. బ్రాహ్మణ సంఘ నాయకులొకరు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు ఫోన్‌చేసి, శవ పరీక్ష నిర్వహించకుండా ధర్మకర్తతో మాట్లాడి ఆర్థిక పరిష్కారం చేయాలని కోరడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తిని తిరిగి తీసుకురాలేమని, అయితే పోలీసు కేసు, పోస్టుమార్టం నిర్వహించడం ద్వారా ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించేలా కృషి చేద్దామన్నారు. అర్చకుని మృతి విషయంలో ఏదిఏమైనప్పటికీ పోస్టుమార్టం నిర్వహించాల్సిందేనని ఎమ్మెల్యే తోట స్పష్టంచేశారు. అప్పటికే పోస్టుమార్టం నిర్వహించే కాలపరిమితి దాటింది. దీంతో అర్చకుని పార్థివ దేహం రామచంద్రపురానికి రావడం లేదని తెలుసుకున్న బ్రాహ్మణ సంఘ నాయకులు వైఎస్సార్‌సీపీ నాయకులు మల్లాది విష్ణు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కౌన్సిలర్ వాడ్రేవు సాయిప్రసాద్, దళిత నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పలువురు అర్చక స్వాములు, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన బ్రాహ్మణులు, శివాలయం నుండి ర్యాలీగా నినాదాలతో మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. రహదారిపై బైఠాయించారు. రామచంద్రపురం డీఎస్పీ జయంతి వాసవీ సంతోష్ నేతృత్వంలో పోలీస్ యంత్రాంగం రాస్తారోకో విరమణకు కృషి చేశారు. భూమిపూజ నిర్వహించిన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పిల్లావారి బ్యాంకు వద్దకు చేరుకున్న సమయంలో అప్పటికే ఆలయం వద్ద బ్రాహ్మణ సంఘం నేతలతో సమావేశమైన మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రీ రాజా కాకర్లపూడి రాజగోపాల నర్సరాజు (గోపాల్‌బాబు), వైస్-్ఛర్మన్ మేడిశెట్టి సూర్యనారాయణ, కౌన్సిలర్ వైట్ల సూర్యప్రకాశరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొమరిన వీర్రాజు, మాజీ ఛైర్మన్ గరిగిపాటి సూర్యనారాయణమూర్తి, టీడీపీ నాయకులు తోట నాగేశ్వరరావు (బాబులు) తదితరులతో ఎమ్మెల్యే తోట మాట్లాడారు. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అక్కడికి వచ్చారని తెలియగానే ధర్నాలో పాల్గొన్న స్థానిక బ్రాహ్మణ సంఘం సభ్యులు ఆప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట వారితో మాట్లాడుతూ బ్రాహ్మణులన్నా, అర్చకులన్నా తనకు అపారమైన భక్త్భివం, గౌరవం ఉన్నాయని, అయితే అర్చకుని మృతి విషయం ఊబిలోకి తనను లాగేందుకు ప్రయత్నించడం సరైంది కాదన్నారు. తనపై బురద చల్లాలనే ప్రత్యేక వ్యూహంతో కొంతమంది వ్యవహరించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుండి కాకినాడలో జరిగిన పరిణామాలన్నీ రామచంద్రపురంలో ఉన్న బ్రాహ్మణులందరికీ ఆయన వివరించడంతో ఆ విషయాలు తమకు తెలియవని ఎమ్మెల్యేకు వారు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్నందున ప్రభుత్వం నుండి ఎటువంటి పరిహారం రాదంటూ, ఆ కుటుంబం వీధిన పడకూడదన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మానవీయ కోణంలో ఒక లక్ష రూపాయలు తన సొంత సొమ్మును బాధిత అర్చకుని భార్యకు అందిస్తానని స్పష్టం చేశారు.
పోస్టుమార్టంపై వివాదం!
కాకినాడ సిటీ, డిసెంబర్ 14: అత్మహత్యాయత్నానికి పాల్పడి కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన అర్చకుడు ఫణికుమార్ మృతదేహానికి పోస్టుమార్టమ్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. మృతుడు ఫణికుమార్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోస్టుమార్టమ్ నిర్వహించరాదంటూ డిమాండ్‌చేసూత బ్రాహ్మణ సంఘాల నాయకులు పోస్టుమార్టమ్‌ను అడ్డుకున్నారు. దీనితో శుక్రవారం మధ్యాహ్నం ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న రామంచద్రపురం ఎస్సై లక్ష్మి తమ సిబ్బందితో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. మృతుని భార్య గాయత్రీదేవితో ఎస్సై లక్ష్మి చర్చించగా తన భర్త ఆత్మహత్యకు పాల్పడడానికి ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ వీరవెంకట సత్యనారాయణ ప్రధాన కారకుడని, ఆయనపైనే కాకుండా అయన భార్య, సోదరునిపై హత్యకేసు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. తనకు న్యాయం జరిగే వరకు తన భర్త మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించరాదని భార్య గాయత్రీదేవి డిమాండ్ చేశారు. బ్రాహ్మణ సంఘాల నాయకులు మాట్లాడుతూ వేధింపులు కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన ఆలయ ఛైర్మన్, ఆయన కుటుంబ సభ్యులపై హత్యకేసు నమోదుచేయాలని, స్థానిక ప్రజాప్రతినిధి ఆలయ ఛైర్మన్‌కు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. మృతుని కుటుంబానికి రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని భార్యకు దేవదాయశాఖలో ఉద్యోగం ఇవ్వాలని బ్రాహ్మణ సంఘం నాయకుడు వి సాంబశివరరావు డిమాండ్‌చేశారు. అర్చకుడు ఫణికుమార్ అత్మహత్యపై రామచంద్రపురం ఆర్డీవో సైతం తప్పుడు నివేదికను ఇచ్చారని బ్రాహ్మణ సంఘాల నాయకులు అన్నారు. ఎస్‌ఐ లక్ష్మి పలు దఫాలుగా చర్చించినా వారు పోస్టుమార్టమ్ చేయడానికి అంగీకరించలేదు. మృతదేహానికి శనివారం పోస్టు మార్టమ్ నిర్వహించే అవకాశం ఉంది. పలువురు బ్రాహ్మణ సంఘ నేతలు మృతుడు భార్య గాయత్రీదేవిని పరామర్శించి సానుభూతిని తెలిపారు. న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు.
రోడ్డుప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం
చింతూరు, డిసెంబర్ 14: బీటెక్ చదువుతున్న అయిదుగురు స్నేహితులు విహార యాత్రకు చింతూరు మండలం పొల్లూరు జలపాతాన్ని తిలకించేందుకు రెండు బైక్‌లపై బయల్దేరారు. ఓ కారు మృత్యు రూపంలో వచ్చి ఇద్దరు విద్యార్థులను కబళించింది. ఈ సంఘటన చింతూరు మండలం కొత్తూరు గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. విద్యార్థుల్లో ఒకరైన పరుచూరి రాహుల్ తెలిపిన వివరాల ప్రకారం..్భద్రాచలానికి చెందిన బాలిని పవన్ (20), సారంక నాగసాయి (20), గడ్డం దేవ స్వరూప్, పరుచూరి రాహుల్, జంజం సంతోష్‌లు చింతూరు మండలంలోని పొల్లూరు జలపాతం అందాలు తిలకించేందుకు రెండు బైక్‌లపై బయల్దేరారు. మండలంలోని కొత్తూరు గ్రామ సమీపానికి వచ్చేసరికి చింతూరు వైపునుంచి భద్రాచలం వైపు వెళుతున్న ఒక కారుకు ఎదురుగా వస్తున్న లారీని ఓవర్‌టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న విద్యార్థుల బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ పల్టీలు కొడుతూ రహదారి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి బైక్‌పై ఉన్న ముగ్గురు విద్యార్థులు ఎగిరి రహదారి అవతలకు పడ్డారు. పవన్, నాగసాయిలు అక్కడికక్కడే మృతిచెందారు. దేవ స్వరూప్ తీవ్రంగా గాయపడటంతో అటుగా వెళుతున్న ఆటోను స్నేహితులు ఆపి ఏడుగుర్రాలపల్లి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు 108లో తరలించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న చింతూరు సీఐ దుర్గాప్రసాద్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. తదుపరి ఏడుగుర్రాలపల్లి పీహెచ్‌సీకి వెళ్లి మృతుల స్నేహితుడైన రాహుల్‌తో ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బైక్‌ను ఢీకొట్టిన కారు ఆపకుండా వెళ్లిపోయింది. కారు కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సమాచారాన్ని తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు ఏడుగుర్రాలపల్లి పీహెచ్‌సీకి వచ్చి కుమారుల మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాలను చింతూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.
ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల విచారణ వేగవంతం చేయాలి
కలెక్టర్ కార్తికేయ మిశ్రా
కాకినాడ, డిసెంబర్ 14: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల్లో సత్వర పరిష్కారం కోసం విచారణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో విధాన గౌతమీహాలులో నిర్వహించిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యాచార కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, బాధితులకు సత్వర న్యాయం ద్వారా ప్రజల్లో కేసుల పరిష్కారం పట్ల నమ్మకం ఏర్పరచాలన్నారు. జిల్లాలో ఈ కేసులు 2016- 17, 2017-18 సంవత్సరాలకు సంబంధించి 73 కేసులు పోలీస్ శాఖ చెల్లించవలసిన నష్ట పరిహారం నిర్ణీత సమయంలో చెల్లించాలని ఇందుకు ఆర్డీవోలు, తహసీల్దార్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో డివిజనల్ కమిటీ సమావేశాలు ప్రతీ నెలా ఏర్పాటు చేయాలని వీటిలో బాధితులు చెప్పుకునే కేసుల వివరాలకు అవకాశం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో గిరిజనులను చైతన్యం చేసేందుకు చితూరు, రంపచోడవరంలో సదస్సులు పెట్టామని జనవరిలో ప్రత్యేక గిరిజన సదస్సు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇంకా మానిటరింగ్ కమిటీ సభ్యులు అనేక సమస్యలు, సందేహాలను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. సభ్యులు గుడాల కృష్ణ, కళ్యాణం కోటేశ్వరరావులు మాట్లాడుతూ అట్రాసిటీ కేసులను త్వరగా విచారణ చేపట్టి పూర్తిచేయాలని, ఆసుపత్రిలో కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరైనా వాటిని అందింవ్వడం లేదన్నారు. శంఖవరం మండలం పెదమల్లాపురం సబ్‌ప్లాన్ ప్రాంతంలో 120 గిరిజన గ్రామాలున్నాయని అక్కడ భూమి సమస్య ఉన్నందువల్ల గిరిజన సదస్సు ఏర్పాటు చేయాలని సభఉయడు పలివెల సత్యానందం కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఆర్డీవోను డీఎస్పీల సమన్వయంతో సదస్సు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ ఎ మల్లికార్జున, రాజమహేంద్రవరం ఎస్పీ షీమోసీ బాజ్‌పాయ్, జెసి-2 సి సత్తిబాబు, సబ్ కలెక్టర్లు సాయికాంత్ వర్మ, వినోద్‌కుమార్, సోషల్ వెల్ఫేర్ డిడిఎంఎస్ శోభారాణి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.