తూర్పుగోదావరి

రత్నగిరిపై పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నవరం, డిసెంబర్ 18: శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు వెలసిన రత్నగిరికి ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సత్యదేవుని దర్శించుకోడానికి మంగళవారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయాన్ని, పరిసరాలను మామిడితోరణాలు, వివిధ రకాల పుష్పాలంకారణతో తీర్చిదిద్దారు. తెల్లవారు జామున 4 నుండి 5 గంటల వరకు ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాన ఆలయానికి ఉత్తర ద్వారం వద్ద వివిధ పుష్ప మాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన శేషపాన్పుపై శయనించిన స్వామి వారికి పాదాలు వత్తే లక్ష్మీదేవిగా స్వామి, అమ్మవార్లను అలంకరించి పండితులు ప్రత్యేక పూజలు జరిపారు. ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం ద్వారా సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్లు భక్తులకు కన్నుల పండువుగా దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం ఉదయం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వెండి తిరుచ్చిపై ఆశీనులను చేసి స్వామి వారి ప్రధానాలయం చుట్టూ ముమ్మారు ప్రదక్షణం గావించారు. ఈ కార్యక్రమంలో ఈవో ఎం జితేంద్ర దంపతులు, ఏఈవో ఎంకెటిఎన్‌వి ప్రసాద్, సూపరింటెండెంట్ అనకాపల్లి ప్రసాద్, బలువు వాసు, ఆలయ తనిఖీ అధికారి పోలినాటి లక్ష్మీనారాయణతోపాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.