తూర్పుగోదావరి

ప్రత్యేక హోదా కోసం ప్రజా ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు వీలుపడదంటూ చెబుతున్న భారతీయ జనతా పార్టీ తీరును నిరశిస్తూ ప్రజా ఉద్యమం చేబడతామని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ అర్‌అండ్‌బి అతిధి గృహంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన అంశాలపై రౌండటేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ఆధ్వర్యంలో నిర్వహించగా జిల్లా ఉద్యోగ సంఘాల జెఎసి ఛైర్మన్ బూరిగ ఆశీర్వాదం అధ్యక్షత వహించారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్ళు కావాలని, పదేళ్ళు ఇస్తామని, మరోకరు పదిహేనేళ్ళు కావాలంటూ వివిధ ప్రకటనులు చేసి నేడు వారంతా పొంతన లేని విధంగా మాట్లాడుతున్నారని వక్తలు విమర్శించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జడ్పి ఛైర్మన్ నామన రాంబాబులు హాజరవుతారని చెప్పి గైర్హాజర్ కావడం పట్ల నాయకలు ఆవేదన వ్యక్తం చేశారు. మిత్రపక్షం బిజెపి జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య హాజరయ్యారు. ప్రత్యేక హోదాను వివరిస్తూ కాకినాడ నగరంలో పలు చోట్ల బహిరంగ సభలు నిర్వహించి హోదా వల్ల కలిగే విషయాలను వెల్లడించాలని తీర్మానించారు. ఈ ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యం అధికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నాయకులు పేర్కొన్నారు. జరిగిన నష్టాన్ని కాకుండా అందరు ఐక్య ఉద్యమాలు సాగించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పలువురు సూచించారు. ప్రత్యేక హోదా కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళే విధంగా ఉప ముఖ్యమంత్రి చినరాజప్పకు వినతి పత్రాన్ని సమర్పించాలని, కేంద్రం నుండి ఇప్పటి వరకు రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయి, ఎంత మేర ఖర్చు చేశారో రాష్ట్ర ప్రభుత్వం శే్వతపత్రం విడుదల చేయాలంటూ నాయకులు డిమాండ్ చేశారు. ఎటువంటి చట్టం చేయకుండా దేశంలో ఇప్పటివరకు 11 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదా కల్పించిన సంగతిని వారు గుర్తు చేశారు. బిజెపి కుంటి సాకులు చెబితే వినేస్ధితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. రాష్ట్ర విభజన చేస్తే ఎన్నో కష్టాలు వస్తాయని ప్రజలు నాయకులు రోడ్డెక్కినా పట్టించుకోలేదని వక్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో కోకనాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దంటు సూర్యారావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, జిల్లా వైకాపా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, బిఎస్పీ నాయకుడు చొల్లంగి వేణుగోపాల్, మనపార్టీ అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్, సిపిఎం జిల్లా నాయకుడు పలివెల వీరబాబు, బిజెపి నగర అధ్యక్షుడు ఎన్‌వి సాయిబాబా, పంతం నానాజీ, నాయకులు ముత్తా శశిధర్, విలియంహ్యేరీ, పిట్టా వరప్రసాద్, ఇరుసుమళ్ళ విష్ణు, దూసర్లపూడి రమణరాజు, ప్రొఫెసర్ ఆలపాటి శ్రీనివాస్, జె వెంకటేశ్వర్లు, కె సత్తిరాజు, వెంకట్రావు, ఆచంట రామారాయుడు, ఆదినారాయణ, తోకల ప్రసాద్, నక్కా కిషోర్ పాల్గొన్నారు.