తూర్పుగోదావరి

మన్యంలో పొగమంచు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, జనవరి 21: వాతావరణంలో వచ్చిన మార్పులతో మన్యంలో సోమవారం తెల్లవారుజామున విపరీతమైన చలితో బాటు పొగమంచు కురిసింది. రాజవొమ్మంగి పరిసర ప్రాంతాల్లో ఉదయం 5 గంటల నుండి 9 గంటల వరకు విపరీతమైన మంచు కురుస్తుంది. పొగమంచుతోబాటు విపరీతమైన చలి కూడా తోడవ్వడంతో ఇళ్లనుండి బయటకు రాలేకపోతున్నారు. ఉదయం 10 గంటలనుండి సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. రాత్రి 9 గంటల నుండి చలిగాలులు ప్రారంభమవుతున్నాయి. కొండల మధ్య ఉన్న గిరిజన పల్లెల్లో చలి మరింత ఎక్కువగా ఉంటుంది.
శబరిమల పవిత్రను కాపాడాలని ధర్నా
కాకినాడ, జనవరి 21: శబరిమల పవిత్రతను కాపాడాలని కోరుతూ శబరిమల అయ్యప్ప సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీజేపీ నాయకులతోపాటుగా అయ్యప్ప సేవా సమితి సభ్యులు అధికంగా పాల్గొని మద్దతు ప్రకటించారు. కేరళ ప్రభుత్వం అయ్యప్ప స్వాముల మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు. వయస్సులో ఉన్న మహిళలను అయ్యప్ప స్వామి దర్శనానికి దగ్గరుండి పంపించి దేవుని అపహాస్యం చేస్తుందని చెప్పారు. హిందూ సంస్థలకు చెందిన వారిని దగ్గరుండి వారిపై దాడులకు ప్రభుత్వం ఉసిగొల్పుతుందన్నారు. తక్షణమే కేరళ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జేసీ మల్లికార్జునకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ ధర్నాలో హిందూ ధర్మారక్ష సమితి నాయకుడు చేదులూరి గవరయ్య, గరిమెళ్ళ అన్నపూర్ణ శర్మ, ముమ్మిడి భాస్కర్, కోరాడ లక్ష్మీతులసి, కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీప్రసన్న, బిజెపి నగర అధ్యక్షుడు చిట్నీడి శ్రీనివాస్, నాయకులు ఎన్‌వి సాయిబాబా, పెండెం బాబ్జి, కె భీమశేఖర్, ఎం సురేష్, కె గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
త్వరలో జైభారత్ నేషనల్ పార్టీకి ఎన్నికల చిహ్నం కేటాయింపు
*జాతీయ అధ్యక్షుడు చిన్నయ్యదొర
సామర్లకోట, జనవరి 21:త్వరలో తమ పార్టీకి ఎన్నికల చిహ్నం కేటాయించే అవకాశం ఉందని జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర వెల్లడించారు. సోమవారం స్థానిక సంపెంగతోట జీసీ అపార్టుమెంటు వద్ద పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఇప్పటికే పలు గుర్తులు కేటాయించాలని ఢిల్లీలో ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశామని, ఒకటి రెండు రోజుల్లోనే తమ పార్టీకి గుర్తింపు చిహ్నం కేటాయింపు జరుగుతుందన్నారు. ఈ నెల 25వ తేదీ నుండి జిల్లాలో తొలి విడతగా పెద్దాపురం అసెంబ్లీ, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంల పరిధిలో పార్టీ ప్రచార రథాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అలాగే జిల్లా వ్యాప్తంగా పార్టీ కమిటీలు, నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రైతులు, సామాన్యులు సంక్షేమం లక్ష్యంగా స్దాపించిన తమ పార్టీని అన్ని వర్గాల ప్రజలను ఆదరించాలని ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చిన్నయ్యదొర విజ్ఞప్తి చేశారు.