తూర్పుగోదావరి

కొత్త పింఛను విధానం రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, జనవరి 21: రైల్వేలో కొత్త పింఛను విధానంను తక్షణమే రద్దు చేయాలని ఐక్యవేదిక చైర్మన్ పిఎస్‌వివిఎన్ శాస్ర్తీ తదితరులు డిమాండ్ చేశారు. సామర్లకోట రైల్వే కళ్యాణ మండపంలో సోమవారం రైల్వే పింఛనుదారుల అసోసియేషన్ సర్వ సభ్య సమావేశాన్ని ఎంవి రమణ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన శాస్ర్తీ మాట్లాడుతూ నూతన పింఛను విధానం రద్దు చేయాలని, అలాగే రైల్వేలో రిటైరైన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని, 70 ఏళ్ల పింఛను నిర్ధారణ తదితర అంశాలపై మాట్లాడారు. తొలుత కార్యదర్శి వార్షిక నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సమావేశంలో ఇటీవల రిటైరైన పలువురు ఉద్యోగులను అసోసియేషన్ నాయకులు ఘనంగా పూలమాలలు దుశ్శాలువాలతో సత్కరించారు. రైల్వే శాఖకు చెందిన ఫించన్ దారులు, అన్ని బ్రాంచిలకు చెందిన అద్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
రూరల్‌లో అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే గోరంట్ల
రాజమహేంద్రవరం, జనవరి 21: రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో జరుగుతోన్న పలు అభివృద్ధి పనులను సోమవారం స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిశీలన జరిపారు. ఆయా పనుల వద్ద సంబంధిత అధికారులతో సమీక్షించారు. రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీలో నూతనంగా నిర్మించిన రైతు బజార్‌ను పరిశీలించారు. అనంతరం చేపల మార్కెట్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. అక్కడ భవన నిర్మాణానికి ప్లాన్ మార్కింగ్ చేయించి యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని అధికారులను గోరంట్ల ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెంట పంచాయతీరాజ్ డీ ఈ రమేష్, మండల మత్య్సశాఖ అధికారి రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి మోషే తదితరులు పాల్గొన్నారు.