తూర్పుగోదావరి

అవినీతి నిరూపిస్తా..చర్చకు సిద్ధమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరుకొండ, జనవరి 21: రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ అవినీతిని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, చర్చ ఎక్కడ పెట్టినా తనకు ఓకేనని, అవినీతిపై చర్చకు ఎమ్మెల్యే పెందుర్తి సిద్ధమేనా అంటూ వైసీపీ కేంద్ర కమిటీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి సవాల్ విసిరారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన స్థానికేతను ప్రశ్నించడం హాస్యాస్పదమని, 2004 వరకూ అప్పటి బూరుగుపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెందుర్తికి ఓటు హక్కు కూడా లేదని, నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెందుర్తి కంటే తాను ఎక్కువగా పర్యటిస్తానన్నారు. చరిత్ర ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కొండను తవ్వడం ద్వారా ఎమ్మెల్యే అవినీతి పరాకాష్ఠకు చేరిందన్నారు. కొండను తవ్వినందుకు కోరుకొండలో పెద్ద ఎత్తున ఉద్యమం జరగడం వల్ల చేసిన పని తప్పేనని ఎమ్మెల్యే అంగీకరించారని, అధికారులపై చర్యలతోపాటు ఎంపీపీతో బహిరంగ క్షమాపణ చెప్పిస్తానన్న ఎమ్మెల్యే, 15 రోజులు గడిచినా ఎలాంటి చర్యల్లేవన్నారు. ఎంపీపీ భర్తచే తూతూ మంత్రంగా స్వామి వారికి క్షమాపణ చెప్పి తంతు ముగించారన్నారు. పదిహేను రోజులు గడిచినా కొండ వద్ద సంప్రోక్షణా లేదు..గోతులూ పూడ్చలేదన్నారు. త్వరలో పెద్ద ఎత్తున స్వామివారి కొండ వద్ద సంప్రోక్షణ జరిపి, ప్రతీ గ్రామం నుంచి మట్టి, నీరు తీసుకువచ్చి పూజలు నిర్వహించి గోతులను పూడ్చివేయించే కార్యక్రమం చేపడతామన్నారు. అదే విధంగా గత పది సంవత్సరాల నుంచీ నీరు-చెట్టు పథకం కింద కోట్లాది రూపాయలు స్వాహా చేశారని, లే అవుట్ల వద్ద ఎమ్మెల్యే కమీషన్లు తీసుకున్నట్లు నిరూపిస్తామని, సీసీ రహదారుల నిర్మాణం కమీషన్ల కోసమేనని ఆరోపించారు. కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరుచేసి ప్రతీ లబ్ధిదారుడి వద్ద రూ.5 వేలు కమీషన్లు తీసుకున్న ఘనత టీడీపీ నేతలదేనన్నారు. ఇసుక, మట్టి మాఫీయా చేసి ఆపై ధర్నాలు చేస్తే అవినీతి చెరిగిపోదన్నారు. గ్లోబల్ ప్రచారం తప్ప నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదని విజయలక్ష్మి విమర్శించారు. కార్యక్రమంలో ఉల్లి బుజ్జిబాబు, నక్కా రాంబాబు, కళ్యాణం రాంబాబు, చిట్టిబాబు, వాకా నరసింహరావు, తోరాటి శ్రీను, బొరుసు బద్రి తదితరులు పాల్గొన్నారు.
ఈబీసీ రిజర్వేషన్‌ల అమలు వెనుక ఆర్‌ఎస్‌ఎస్ హస్తం
*మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు భగవాన్
సామర్లకోట, జనవరి 21: కేవలం పార్లమెంటు ఎన్నికలకు మూడు నెలల ముందు బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీలు కలసి అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్‌లు అమలుచేయడం వెనుక ఆర్‌ఎస్‌ఎస్ హస్తం ఉందని, ఎన్నికలకు ముందు రిజర్వేషన్లు ఇవ్వడం సిగ్గుచేటు అని మాలమహానాడు రాష్ట్ర అద్యక్షుడు పిఎస్ భగనవాన్ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామర్లకోట పెన్షన్‌లైన్‌లో సోమవారం అంబేద్కర్ విగ్రహానికి భగవాన్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్రం తీసుకున్న రిజర్వేషన్ అమలు నిర్ణయంను వ్యతిరేకిస్తూ కొంతసేపు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా బిజేపీ మరోసారి మతతత్వ పార్టీ అని రుజువు చేసుకుందని విమర్శించారు. దళితులకు ఇచ్చిన రిజర్వేషన్‌లను నేటికి పూర్తిగా భర్తీ చేయకుండా, అగ్రవర్ణాలకు రిజర్వేషన్‌లు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. మాలమహానాడు రాష్ట్ర అదికార ప్రతినిధి వల్లపు రామారావు మాట్లాడుతూ తక్షణమే కేంద్రం ఈ నిర్ణయంను వెనక్కి తీసుకోవాలని, లేదంటే మాలమహానాడు ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోలుపల్లి అన్నవరం, తెలుగు మూర్తి, కోన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.