తూర్పుగోదావరి

సమరానికి సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 21: ఎన్నికల సమరానికి సన్నద్ధమా అన్నట్టుగా బీసీ సదస్సు వేదిక కానున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 27న రాజమహేంద్రవరం ఆర్ట్సు కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న జయహో బీసీ సదస్సును జయప్రదం చేసేందుకు నాయకులు మధ్య పోటీ నెలకొంది. ఎవరికి వారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సదస్సును నిర్వహించాలని ఆరాటపడుతున్నారు. ఇందుకు పెద్ద ఎత్తున సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. టీడీపీలోని వివిధ శ్రేణులు పోటా పోటీగా ఈ సదస్సుకు జయప్రదం చేసే లక్ష్యంలో తలమునకలయ్యాయి. ఈ సదస్సు నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్టు తెలుస్తోంది. దీంతో నేతలంతా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఈ సభపై దృష్టి పెట్టారు. తెలుగుదేశం పార్టీకి బీసీలే ఆయువుపట్టుగా ఉన్నారని మరోసారి నిరూపించే విధంగా ఈ సదస్సును నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం ఆర్ట్సు కాలేజి గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం 1 గంటకు మొదలయ్యే ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీల అభ్యున్నతికి కార్యాచరణ ప్రణాళిక ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈ సభను ప్రధానంగా గోదావరి జిల్లాల పార్టీ శ్రేణులు అత్యధికంగా తరలి రానున్నట్టు తెలిసింది. సదస్సుకు దాదాపు మూడు లక్షలకు పైగా హాజరయ్యేందుకు అవకాశం ఉందని అంచనా వేశారు. అందుకు తగిన విధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే శ్రేణులకు భోజన, వసతి సదుపాయాలతో ఆతిధ్యమిచ్చేందుకు స్థానిక పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గం నుంచి సోమవారం అమరావతి వెళ్ళిన నాయకులు ముఖ్యమంత్రి సదస్సు ఏర్పాటు వివరాలను తెలియజేసినట్టు తెలిసింది. ఇప్పటికే బీసీ నాయకులు ఉపకులాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ సదస్సుకు తరలివచ్చే విధంగా సమాయత్తం చేశారు. బీసీల సామాజికాభివృద్ధికి సంబంధించిన అంశాలను ఇప్పటికే ప్రధాన అజెండాలో వచ్చే విధంగా సమీకరించినట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం, రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పర్యవేక్షణలో స్థానిక ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పెందుర్తి వెంకటేశ్, గుడా ఛైర్మన్ గన్ని కృష్ణ, మేయర్ పంతం రజనీ శేషసాయి, శాప్ డైరెక్టర్ యర్రా వేణుగోపాలరాయుడు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు నామన రాంబాబు, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, జిల్లా టిఎన్‌టీయూసీ అధ్యక్షుడు నక్కా చిట్టిబాబు, వివిధ పార్టీ శ్రేణులు ఎప్పటికపుడు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఈ సదస్సు విజయవంతంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ సదస్సు విజయవంతాన్ని బట్టే స్థానిక కొంత మంది నాయకులకు వారు ఆశించే లక్ష్యానికి సంబంధించి మార్కులు పడొచ్చని తెలుస్తోంది.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో డొల్లతనం..!!
*‘విజిలెన్స్’ తనిఖీల్లో బయటపడిన లోపాలు

రాజమహేంద్రవరం, జనవరి 21: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలులో డొల్లతనం విజిలెన్స్ తనిఖీల్లో బయట పడుతోంది. జిల్లా విజిలెన్స్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీల్లో భాగంగా విజిలెన్స్ అధికారులు సోమవారం జిల్లాలోని గండేపల్లి, తొర్రేడు, లొల్ల తదితర కేంద్రాలను తనిఖీ చేశారు. గండేపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు అక్కడ రికార్డులు సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించారు. దీనికి తోడు ఉన్నతాధికారులు ఏ విధమైన తనిఖీలు చేయకపోవడం, ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతు ధ్రువీకరణ పత్రాలను వ్యవసాయం చేసేవారికి బదులు ఇతరులకు జారీ చేసి ధాన్యం కొనుగోలు చేయడం గుర్తించారు. లొల్ల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో కూడా రికార్డులు సరిగా నిర్వహించకపోవడం, ఉన్నతాధికారులు తనిఖీలు చేయకపోవడం గుర్తించారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం కొనుగోలు నేరుగా మిల్లర్ల ద్వారా జరుగుతుందని, రైతులెవరూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తేవడం లేదని విజిలెన్స్ తనిఖీల్లో తేలింది. ఈ తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు వై సత్యకిషోర్, బి సాయి రమేష్, జి గోపాలరావు, పీబీ రత్నకుమార్, జె భార్గవ మహేష్, షేక్ వల్లీ, రంగకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.