తూర్పుగోదావరి

కాకినాడ జీజీహెచ్‌లో రోగులకు మెరుగైన సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, ఫిబ్రవరి 7: కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో రోగులకు ప్రస్తుతం కల్పిస్తున్న సదుపాయాలు, వైద్య సేవలను మరింతగా మెరుగుపరచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి నిర్వహణ ఖర్చుల నిమిత్తం కొన్ని సేవలకు ఇకనుండి యూజర్ చార్జీలను వసూలుచేయాలని నిర్ణయించారు. ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశం జేసి మల్లికార్జున అధ్యక్షతన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛాంబర్‌లో గురువారం జరిగింది. సమావేశంలో ముందుగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఆయన సమీక్షించారు. ఆసుపత్రి నిర్వహణ ఖర్చుల నిమిత్తం నిధులు సమకూర్చేందుకు కొన్సి సేవలకు యూజర్ చార్జీల పెంచడానికి ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేసింది. ఎల్‌ఐసి డెత్ క్లెయిమ్స్‌కు సంబంధించి ధ్రువపత్రాల జారీకి ప్రస్తుతం వసూలు చేస్తున్న 100 రూపాయల యూజర్ చార్జీని 300 రూపాయలకు పెంచారు. అదే విధంగా ప్రస్తుతం ఆసుపత్రి ఉచితంగా ఇస్తున్న కేస్ షీట్ కాపీలకు 100 రూపాయలు వసూలుచేయాలని నిర్ణయించారు. జనన, మరణ ధ్రువపత్రాలకు మొదటి కాపీని ఉచితంగా అందజేసి, అదనంగా ఇచ్చే ప్రతి కాపీకి 50 వసూలుచేయదలిచారు. సమావేశం అజెండాలో పొందుపరిచిన ఈ-ఆఫీస్ విధానం అమలుకు మూడు హైకన్ఫిగరేషన్ కంప్యూటర్ల అవసరాన్ని సొసైటీ చర్చించి వాటి కొనుగోలుకు ఆమోదం తెలిపారు. అదే విధంగా న్యూరాలజీ విభాగంలో ఈఈజి టెక్నీషియన్, ఈఎన్‌టి విభాగంలో ఆడియోలజిస్ట్‌లకు ప్రస్తుతం చెల్లిస్తున్న 9 వేల నెలసరి మొత్తాన్ని పెంచేందుకు సొసైటీ ఆమోదాన్ని తెలియజేసింది. జిల్లాలో ప్రముఖులు జరిపే పర్యటనల సందర్భంగా అత్యవసర వైద్యసేవలను అందుబాటులో ఉంచేందుకు ప్రస్తుతం వినియోగిస్తున్న అంబులెన్స్‌లు పనికిరాకుండా పోవడంతో వాటి స్థానంలో 50 లక్షల రూపాయల వ్యయంతో కొత్తగా రెండు అంబులెన్స్‌లను సిఎస్‌ఆర్ నిధులతో కొనుగోలు చేయడానికి ప్రతిపాదనలు కలెక్టర్‌కు సమర్పించాలని సొసైటీ నిర్ణయించింది. ఈ సందర్భంగా జేసీ మల్లికార్జున మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన సూచనలు, సలహాలను ఇవ్వాలన్నారు. ఆసుపత్రి క్యాజువాలిటీ విభాగంలో రోగుల తాకిడికి అనుగుణంగా వైద్యులు, సిబ్బందిని పెంచాలని సభ్యులు డాక్టర్ ఎంవి ఆనంద్, గైనిక్ వార్డులో నర్సింగ్ సిబ్బంది సంఖ్య పెంచాలని డాక్టర్ ప్రభావతి జేసీని కోరారు. సభ్యుడు బి వెంకటరమణమూర్తి పీడియాట్రిక్ విభాగంలో 40 ఇన్‌క్యుబేటర్‌లలో 20 పనిచేయడం లేదని, ఆరు వెంటిలేటర్లలో 3 పనిచేయడం లేదని, వాటిని వెంటనే రిపేర్లు చేయించాలని జేసీ దృష్టికి తీసుకువచ్చారు. కాజువాలిటీకి వచ్చే వికలాంగ, వృద్ధ రోగులను వివిధ విభాగాలకు తరలించేందుకు ట్రాలీలు, వీల్‌చైర్లు, సహాయక సిబ్బంది సేవలను పెంచాలని సభ్యులు కోరారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలను అందజేసేందుకు రూ. 30 కోట్ల నిధులతో వివిధ విభాగాల్లో అభివృద్ధి చేపట్టినందుకు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాఘవేంద్రరావు, రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ మహాలక్ష్మి, సిఎస్‌ఆర్‌ఎంఒ డాక్టర్ బి సత్యసుశీల, కమిషనర్ కె రమేష్, ఈఈ కేశవరావు తదితరులు పాల్గొన్నారు.