తూర్పుగోదావరి

చిరుత జాడ ఏది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్రేయపురం, ఫిబ్రవరి 7: చిరుత సంచారం వార్తల నేపధ్యంలో గత నాలుగు రోజులుగా భయం గుప్పెట్లో ఆత్రేయపురం ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నరు. అంకంపాలెం శివారు పంట పొలాల్లో సోమవారం నలుగురిపై దాడి చేసిన చిరుత కొబ్బరి చెట్టుపై దాక్కోవడంతో గ్రామస్థులు కాపలా కాసి అటవీ అధికారులకు అప్పగించారు. అటవీ అధికారులు నిర్లక్ష్యం కారణంగా చిరుత చెట్టు నుండి దూకి పంట పొలాల్లో మాయమైంది. అప్పటి నుండి గాలింపు చర్యలు చేపట్టినా గురువారం నాటికి కూడా చిరుత జాడ కనుగొనలేక పోయారు. పులిజాడ ఏమైంది అని గ్రామస్థులు అధికారులను నిలదీసినా సరైన సమాధానం లేదు. అటవీ శాఖ అధికారులు త్వరలోనే పట్టుకుంటామని కంటితుడుపు చర్యగా చెబుతున్నారు. రైతులు తమ పంట పొలాల్లో పశువుల శాలల వద్దకు గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. రైతాంగం వేకువ జామునే పశువుల శాలను శుభ్రంచేసి, మేతవేసి, పాలతో ఇంటికి వచ్చేవారు. చిరుత సంచారం భయంతో ఉదయం వెలుగు వచ్చిన తరువాత గుంపులుగా వెళ్లి పాడి పశువులను చక్కబెట్టుకుని గుంపులుగా వస్తున్నారు. చిరుత జాడ ఇంతవరకు తెలియకపోవడంతో కూలీలు పనులకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల్లో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయి నష్టపోతున్నామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మహిళా కూలీలైతే చిరుత జాడ తెలిసే వరకు పనులకు రాలేమని బహిరంగంగానే చెబుతున్నారు. చిరుత తప్పించుకుని నాలుగు రోజులైనా ఇంతవరకు అటవీ అధికారులు, సిబ్బంది చిరుత జాడ కనుగొనలేకపోయారని పలువురు విమర్శిస్తున్నారు. కాగా బుధవారం రాత్రి మెర్లపాలెం వైపున చిరుత పులి అడుగులు ఉన్నట్టు తెలిసి పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. మెర్లపాలెం, ఊబలంక గ్రామాల ప్రజలైతే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇకనైనా అటవీ అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించి, చిరుత జాడ కనుగొని చిరుత భయం నుండి విముక్తులను చేయాలని ప్రజలు కోరుతున్నారు.