తూర్పుగోదావరి

నర్సింహస్వామివారి పవళింపు సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలికిపురం, ఫిబ్రవరి 21: అంతర్వేది శ్రీ లక్ష్మీనర్సింహస్వామివారి తీర్థ మహోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన స్వామివారి పవళింపు సేవా కార్యక్రమం బుధవారం రాత్రి 10 గంటలకు ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. స్వామివారి శయన మండపంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను అలంకరించి ఈ కార్యక్రమాన్ని పూర్తిచేశారు.
మాతృభాష మమకారాన్ని చూపేది గురువే
*రిజిస్ట్రార్ ఆచార్య టేకి

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 21: బిడ్డ ఎదుగుదలకు అమ్మ పాలెంత అవసరమో, మానవ వికాసానికి మాతృభాషంత అవసరమని, అటువంటి మాతృభాషలోని మమకారాన్ని హేతుబద్ధంగా నేర్పించేది గురువేనని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ టేకి అన్నారు. గురువారం యూనివర్సిటీలోని తెలుగు, విద్యాశాఖా విభాగాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించారు. రెక్టార్ ఆచార్య పి సురేష్‌వర్మ, రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ టేకి తెలుగుతల్లి చిత్రపటానికి పూల మాల వేసి, విద్యార్థులకు మాతృభాష శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ టేకి మాట్లాడుతూ భారత సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత అంతటి మహోన్నత స్థానం గురువులకే వుందన్నారు. కాబట్టి ఎంత ఉన్నత శిఖరాలను అధిరోహించినా గురువును మరువకూడదన్నారు. రెక్టార్ ఆచార్య పి సురేష్‌వర్మ మాట్లాడుతూ ఆంగ్ల భాష మాతృభాషపై ప్రభావం చూపిస్తోందని, అవసరానికి ఆంగ్లాన్ని ఉపయోగించాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఎం గోపాలకృష్ణ, డాక్టర్ కేవీఎస్డీ వరప్రసాద్, డాక్టర్ డి ఎలీషాబాబు, ఆర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అవినీతిలో కూరుకుపోయిన బీజేపీ ప్రభుత్వం
*ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప
కాకినాడ సిటీ, ఫిబ్రవరి 21: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తి అవినీతిలో కూరుకుపోయిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాల చినరాజప్ప తీవ్రంగా ఆరోపించారు. కాకినాడలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాజమండ్రికి వచ్చి తెలుగుదేశం ప్రభుత్వంపై, చంద్రబాబునాయుడుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలో 18 అంశాలను పేర్కొనగా వారు 14 అని అంటున్నారని, అయితే వాటిలో ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులను ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం చూపుతోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కక్షగట్టిన కేంద్రం రాష్ట్రానికి సహాయం చేయడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి ప్రజలకు అందించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషిచేస్తుంటే, కేంద్రం ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు కల్పిస్తోందని ఆయన ఆరోపించారు. తమ పార్టీకి చెందిన నాయకులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ అవినీతి సొమ్ముతో కొంటున్నారన్నారు. కేటీఆర్, కేసీఆర్, అవినీతి సొమ్ము బీజేపీ సహకారంతో జగన్ ఈ పనికి పాల్పడుతున్నారని చినరాజప్ప విమర్శించారు. ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన బుద్ధిచెబుతారని హెచ్చరించారు. ఎంతమంది తమ పార్టీని వీడినా తెలుగుదేశం పార్టీకి నష్టం లేదన్నారు. ప్రజల మద్దతు తమకే ఉందని చినరాజప్ప ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు నున్న దొరబాబు, బి మోహన్, జహీరుద్ధీన్ జిలాని, బాబి తదితరులు పాల్గొన్నారు.