తూర్పుగోదావరి

పట్ట్భద్రుల నియోజకవర్గ ఓటరు జాబితా విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, ఫిబ్రవరి 21: ఉభయ గోదావరి జిల్లాల పట్ట్భద్రుల నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా గురువారం రాత్రి విడుదల చేశారు. 2 లక్షల 90 వేల 780 మంది ఓటర్లుగా నమోదయ్యారని తెలిపారు. కలెక్టరేట్ కోర్టు హాలులో గురువారం రాత్రి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తూర్పు-పశ్చిమగోదావరి పట్ట్భద్రుల నియోజకవర్గానికి ప్రకటించిన తుది ఓటర్ల జాబితా వివరాలు వెల్లడించారు. ఈ నెల 23, 24 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాల నిర్వహణ, ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటరు హెల్ప్‌లైన్ యాప్ అంశాలను తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల పట్ట్భద్రుల నియోజకవర్గంలో ఈ నెల 10వ తేదీవరకు నిర్వహించిన ఓటరు నమోదు కార్యక్రమం ద్వారా మొత్తం 2 లక్షల 70 వేల 780 మంది ఓటర్లుగా నమోదయ్యారన్నారు. వీరిలో తూర్పుగోదావరి జిల్లాలో 1,70,913 ఓటర్లు ఉండగా, పశ్చిమగోదావరి జిల్లాలో 1,19,867 మంది ఓటర్లుగా నమోదయినట్లు చెప్పారు. ఈ నియోజకవర్గానికి తూర్పు గోదావరికి జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగాను, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీ గోవిందరాజులు, పశ్చిమగోదావరి జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ సత్యనారాయణలు వ్యవహరిస్తారని ఆయన తెలియజేశారు. నియోజకవర్గంలో మొత్తం 299 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయగా, ఇందులో 166 తూర్పుగోదావరి జిల్లాలోను, 133 పశ్చిమగోదావరి జిల్లాలోను ఉన్నాయన్నారు. నియోజకవర్గాన్ని టెంటటీవ్‌గా 44 జోన్లుగాను, 51 రూట్‌లుగా విభజించామని వివరించారు.
ఓటరు హెల్ప్‌లైన్ యాప్.....
పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల సౌకర్యం కోసం ఎన్నికల కమిషన్ నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చిన మొబైల్ యాప్ సేవలను ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పిలుపునిచ్చారు. ఈ యాప్ ద్వారా ఓటరు జాబితాలో తమ పేరు, వివరాలను ఓటర్లు తెలుసుకోవచ్చని, అదే విధంగా నూతనంగా ఓటరు నమోదు పొందవచ్చని చెప్పారు. వికలాంగ ఓటర్లు ఈ యాప్ ద్వారా జాబితాలలో మార్కింగ్ పొంది, పోలింగ్ బూత్‌ల వద్ద తమకు వీల్‌చైర్‌లు, ఇతర సహాయాల కోసం తెలుసుకోవచ్చునని తెలిపారు. వీటితోపాటు ఎన్నికలు, ఓటింగ్ యంత్రాలు, ఓటరు సేవలు, ఓటరు విద్య వంటి పలుసేలు ఈ యాప్‌లో పొందుపరిచినట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్‌లో అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను ఎన్నికల కమిషన్ త్వరలో యాపిల్ వెర్షన్ విడుదల చేయనుందన్నారు. ప్రజలు గూగుల్ స్టోర్ నుండి ఈ హెల్ప్‌లైన్ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. ఇప్పటికే 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఓటరు సమాచార సేవలు అందుబాటులో ఉండగా, నూతనంగా ఏర్పాటుచేసిన ఓటరు హెల్ప్‌లైన్ యాప్‌తో ఓటర్లు కోరుకునే సమాచారాన్ని మరింత సులువుగా అందిస్తున్నట్లు కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలియజేశారు.

పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు సౌకర్యాలు
*కలెక్టర్ కార్తికేయ మిశ్రా
కాకినాడ సిటీ, ఫిబ్రవరి 21: ఎన్నికల కమిషన్ నిర్దేశించిన విధంగా జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు సౌకర్యాలు కల్పిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. ఎన్నికల కమిషన్ నుండి జిల్లా పర్యటనకు వచ్చిన రెగ్యులేటరీ ఆడిట్ బృందం గురువారం కాకినాడ నగరం, పెద్దాపురం నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు కల్పిస్తున్న ఏర్పాట్లు, ఓటర్లకు చేపట్టిన సౌకర్యాలను వారు పరిశీలించారు. ఎన్నికల కమిషన్ కార్యదర్శి టిసి కోమ్, సెక్షన్ ఆఫీసర్ ఎంసీ శర్మ, ఎఎస్‌ఓ శివకుమార్‌లతో కూడిన బృందం వెంట కలెక్టర్ మిశ్రా, జిల్లా ఎస్పీ విశాల్ గున్ని ఉన్నారు. బృందంతో వారు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ముందుగా ఆడిట్ టీమ్ కాకినాడ సిటీ నియోజకవర్గం పరిధిలోని గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల, 49, 53నెంబర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం పెద్దాపురం నియోజకవర్గం పరిధిలో పెద్దాపురం అగ్రహారంలో శ్రీ చాణుక్య పురపాలక ప్రాథమికోన్నత పాఠశాలలోని 59వ నంబర్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహణకు అవసరమైన సదుపాయాలు, భద్రత, ఓటరుకు కల్పించిన సదుపాయాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా బృందం సభ్యులకు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఓటరు జాబితా, డి డూప్లికేషన్ సాఫ్ట్‌వేర్ సహాయంతో డూప్లికేట్ ఓటర్ల పరిశీలన, పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలు తదితర వివరాలను కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో బి రాజకుమారి, పలువురు డీఎస్పీలు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, బీఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.