తూర్పుగోదావరి

తెలుగులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి అమరరంగేశ్వరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలమూరు, ఫిబ్రవరి 21: ఆలమూరు జూనియర్ సివిల్ కోర్డు జడ్జి ఓ సారా కేసుకు సంబంధించి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగులో తీర్పు చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలిలా వున్నాయి. ఆలమూరు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో మండపేట మండలం కేశవరం గ్రామానికి చెందిన గండిమేను త్రివేణిని రాజమహేంద్రవరం ఎక్సైజ్ ప్రత్యేక బృందం వారు ఐదు లీటర్లు నాటుసారాతో 2015 మే 1న అరెస్టుచేసి కేసు నమోదు చేయగా అప్పటి నుండి వాదోపవాదనలు విన్న న్యాయమూర్తి హెచ్ అమరరంగేశ్వరావు ఎక్సైజ్ శాఖ అధికారులు సరైన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టకపోవడంతో ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ తెలుగులో తీర్పు చెప్పారు. ఈ కేసును ఆలమూరుకు చెందిన న్యాయవాది బి మహేశ్వరరావు వాదించారు. తెలుగులో తీర్పు చెప్పడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు. అలాగే తెలుగులో తీర్పు చెప్పడం వలన కక్షీదారులకు సమగ్ర సమాచారం అందుతుందని పేర్కోన్నారు.