తూర్పుగోదావరి

ఎన్నికల దిశగా.. చంద్రబాబు లక్ష్యంగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 21: ఎన్నికల దిశగా శ్రేణులను సమాయత్తం చేస్తూ చంద్రబాబునాయుడు లక్ష్యంగా పని చేసేందుకు బీజేపీ శక్తి కేంద్రాల సమ్మేళనం నాయకులు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, మోదీ అందించిన సంక్షేమం తెలియజేస్తూ కొత్త సభ్యులను చేర్చుకునే దిశగా ముందుకెళ్ళాలని నాయకులు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలోని జాతీయ రహదారిని ఆనుకుని హోండై షోరూమ్ పక్కన గ్రౌండ్‌లో బీజేపీ ఉభయ గోదావరి జిల్లాల శక్తి కేంద్రాల సమ్మేళనం భారీ స్థాయిలో గురువారం జరిగింది. భారీ బహిరంగ సభ మాదిరిగా చేసిన ఏర్పాట్ల మధ్య భారీ వేదికపై నాయకులు అమిత్‌షా రాకకు ముందుగా అంశాల వారీగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏలూరు, నర్సాపురం, రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 35 అసెంబ్లీ స్థానాల నుంచి బూత్ కమిటీలు, శక్తి కేంద్రాల బాధ్యులు ఈ సభకు తరలి వస్తున్నట్టు తెలియజేశారు. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ అఖిలభారత అధ్యక్షుడు అమిత్‌షా పర్యటన సుమారు గంట ఆలస్యంగా జరిగింది. ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న అమిత్‌షాకు రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం నగరానికి చేరుకుని ముందుగా స్థానిక 47వ డివిజన్‌లో కార్పొరేటర్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రేలంగి శ్రీదేవి ఆధ్వర్యంలో అమిత్‌షా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై స్థానికులతో మాట్లాడారు. ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన పథకంలో ఇళ్ళు నిర్మించుకున్న లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. అనంతరం క్వారీ సెంటర్‌లోని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. 12.50 నిమిషాలకు సభావేదిక వద్దకు చేరుకుని ముందుగా అమర జవాన్లకు నివాళి అర్పించారు. 1.21 నిమిషాలకు తన ప్రసంగాన్ని మొదలుపెట్టి 1.53 నిమిషాలకు ప్రసంగాన్ని ముగించారు.
ఇదిలా వుండగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన భోజన టెంట్ల వద్దకు వెళ్ళడం కన్పించింది. దీంతో నాయకులు సభ నుంచి ఎవరూ వెళ్ళవద్దని వారించడం చోటు చేసుకుంది. అమిత్‌షా ప్రసంగం చేస్తుండగా కొంతమంది భోజన టెంట్ల వద్దకు వెళ్ళిపోవడం కన్పించింది. మొత్తం మీద భారీ ఏర్పాట్ల మధ్య అమిత్‌షా సభ జరిగింది. రాష్ట్ర నాయకులు రవీంద్రరాజు, గరిమెళ్ల చిట్టిబాబు, వేటుకూరి సూర్యనారాయణరాజు, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, స్థానిక నాయకులు అడబాల రామకృష్ణ, గంగాధర్, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, రామ్మోహరావు, యానాపు ఏసు, సాంబశివరావు, శాంతారెడ్డి, ఆకుల శ్రీ్ధర్, ఏపీ ఆర్ చౌదరి, రాష్ట్ర, కేంద్ర కమిటీల నాయకులు, శక్తి కేంద్రాల బాధ్యులు, బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.