తూర్పుగోదావరి

మహా శివరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, ఫిబ్రవరి 21: మార్చి 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రముఖ పంచారామ క్షేత్రమైన శ్రీ కుమారరామ భీమేశ్వరాలయంలో నిర్వహించే మహా శివరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధికారులను ఆదేశించారు. స్థానిక భీమేశ్వరాలయంలో గురువారం సాయంత్రం మహా శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈవో పులి నారాయణమూర్తి అధ్యక్షతన అధికారుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ముఖ్యఅతిథులుగా ఉప ముఖ్యమంత్రి రాజప్పతోపాటు కాకినాడ ఆర్డీవో రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజప్ప మాట్లాడుతూ మహాశివరాత్రి ఈ ఏడాది మార్చి 4వ తేదీ సోమవారం వచ్చినందున ఆరోజు శివుని దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య లక్షకు పైగా ఉండే అవకాశం ఉన్నందున దానికి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. స్నానఘట్టాల వద్ద మత్స్యశాఖ అధికారులు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. సరిపడినంత విద్యుద్దీపాలను ఏర్పాటు చేయడంతోపాటు ట్రాన్స్‌కో అధికారులు 24 గంటల పాటు విద్యుత్ సరఫరాను అందించాలన్నారు. అలాగే ఉత్సవాలకు 10 రోజుల ముందే గోదావరి కాలువలో కలుషిత జలాలు రాకుండా అలాంటి పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇంకా భక్తులకు మంచినీరు, మరుగుదొడ్లు వంటి సధుపాయాలతో పాటు భక్తులకు, పిల్లలకు మజ్జిగ, పాలు వంటి సేవలను స్వచ్ఛంద సంస్థల ద్వారా అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. కాగా ఆలయం వద్ద రోడ్డు నిర్మాణానికిగానూ జిల్లా కలెక్టర్ నిధులను ఇచ్చినందున వాటితో పనులు చేపట్టనున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు ఆలయం వద్ద అతిథి గృహం, డార్మెటరీ వంటి నిర్మాణాలను చేపడుతుండగా అవి ప్రగతిలో ఉన్నాయన్నారు. ఆలయం లోపల పనులకు సంబంధించి పురావస్తు శాఖ నుంచి అనుమతులు రాలేదన్నారు. త్వరలో వాటిని ప్రారంభించనున్నట్టు ఆయన చెప్పారు. కాగా భక్తుల తాకిడిని బట్టి మహా శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ, దేవదాయ శాఖలు అవగాహనతో ముందుకు సాగాలన్నారు. సమావేశంలో కాకినాడ ఆర్డీవో రాజకుమారి మాట్లాడుతూ ఉత్సవాలకు పలు సూచనలు చేశారు. కాగా అనంతరం పెద్దాపురం నియోజకవర్గంలో 9 మందికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.3,32,350ల చెక్కులను మంత్రి రాజప్ప అందజేశారు. సమావేశంలో ఆలయ చైర్మన్ కంటే జగదీష్, మున్సిపల్ వైస్‌చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, ఆసుపత్రి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, మాజి మున్సిపల్ చైర్మన్ డా. చందలాడ అనంతపధ్మనాబం, మున్సిపల్ కమిషనరు వి పాగేంద్రకుమార్, తహసీల్దార్ నరసింహారావు, ట్రాన్స్‌కో డీఈ రామకృష్ణ, పెద్దాపురం డీఎస్పీ చిలకా వెంకట రామారావు, యువకుమార్, అధిక సంఖ్యలో అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, భక్త సంఘం, అన్నదాన కమిటీ నాయకులు, ఆలయ పండితులు, సిబ్బంది పాల్గొన్నారు.

కొత్తపేట సబ్ స్టేషన్‌ను మట్టడించిన రైతులు
కొత్తపేట, ఫిబ్రవరి 21: రైతులకు ఇచ్చే విద్యుత్ వేళలను మార్చాలంటూ కొత్తపేట విద్యుత్ సబ్‌డివిజన్ కార్యాలయాన్ని గురువారం రైతులు ముట్టడించారు. కొత్తపేట, మందపల్లి, కేదార్లంక, వీధివారిలంక గ్రామాలకు చెందిన సుమారు 200 మంది రైతులు ఈ ముట్టడిలో పాల్గొన్నారు. అర్ధరాత్రి సమయంలో విద్యుత్ ఇస్తుండటంతో ఆ సమయంలో పొలానికి వెళ్లి నీరు ఏవిధంగా పెట్టాలని, రైతులకు ఇచ్చే విద్యుత్ వేళల్లో మార్పు చేయాలని విద్యుత్ ఏడీఈ ఎన్ వెంకటేశ్వరరావును రైతులు డిమాండ్ చేశారు. వ్యవసాయ అవసరాల కోసం విద్యుత్‌ను తొమ్మిది గంటల పాటు ఇస్తున్నా గతంలో ఏడు గంటల పాటు ఇచ్చే విద్యుత్‌తో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కావని, ప్రస్తుతం తొమ్మిది గంటలపాటు విద్యుత్ పేరుతో అర్ధరాత్రుళ్లు ఇస్తున్నారని, దీని వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఆ సమయంలో పొలంలో ఎక్కడ ఏ విషజంతువులు ఉంటాయో తెలియని పరిస్థితి అని, దానికితోడు ఎక్కడైనా విద్యుత్ వైరు తెగినా లేక విద్యుత్ షాక్ వంటి ప్రమాదాలు జరిగినా ఎవరికీ తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంగా చాలా మంది రైతులు విద్యుత్ షాక్‌కు గురయ్యారన్నారు. దీనికి తోడు ఇటీవల చిరుత వంటి అడవి జంతువులు వస్తున్నాయని, వీటి నుంచి పగలైతే అయితే రక్షించుకోవచ్చునని, రాత్రి సమయంలో దాడి చేస్తే ఏవిధంగా రక్షించుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతులకు ఇచ్చే విద్యుత్‌ను అర్ధరాత్రి 12 గంటలకు కాకుండా తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇస్తే రైతులకు మంచిదన్నారు. ఈ విషయమై ఏడీఈ వెంకటేశ్వరరావుతో రైతులు చర్చలు జరిపారు. అయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి విద్యుత్ సరఫరా వేళల్లో మార్పులు తీసుకువస్తామని రైతులకు ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి రైతు నేతలు అన్యం శివరామకృష్ణ, మోకా సత్తిబాబు, సాదా సూర్యనారాయణ, యర్రంశెట్టి సుబ్బారావు, మానే కృష్ణ, రావూరి అప్పారావు, అన్యం సత్తిరాజు, గంధం వెర్రియ్య, చోడపనీడి సత్యనారాయణ, చోడపనీడి శివ తదితరులు నాయకత్వం వహించారు.