తూర్పుగోదావరి

జీవ నదులు జాతి సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 25: జీవ నదులు జాతి సంపద అని, మానవ మనుగడ కోసం వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం వుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక నటరాజ్ థియేటర్ వద్ద వున్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌లో జీవనది ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీవనదుల పరిరక్షణ, కాలుష్య నివారణపై సదస్సు ఆదివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమాన్ని అద్దంకి రాజయోనా నిర్వహించారు. ఆత్మీయ అతిథులుగా పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొల్లివెలసి హారిక మాట్లాడుతూ నదులు కలుషితం కాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై వుందన్నారు. రాజమహేంద్రవరం నగరంలో 40 రోజుల పాటు పిల్లలు, పెద్దలు అందరూ కలిసి శ్రమదానం చేసి గోదావరి ఘాట్‌లను పరిశుభ్రం చేశారన్నారు. కొల్లిమళ్ళ వైష్ణవి, కొల్లివెలసి మనీషా చేపట్టిన ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములయ్యారన్నారు. నదులను కలుషితం కాకుండా కాపాడామని అందరితో ఆమె ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు చైతన్యవంతులు కావాలని, స్వచ్ఛంధంగా జలకాలుష్య నివారణలో భాగస్వాములు కావాలన్నారు. గోదావరి చెంతనే వున్నప్పటికీ పరిశుభ్రమైన నీటిని తాగలేకపోవడానికి జల కాలుష్యమే కారణమన్నారు. జల కాలుష్య నివారణకు తాము అలుపెరగని పోరాటం చేస్తున్నామన్నారు. ప్రజలు చైతన్యవంతులై ఘాట్‌లను పరిశుభ్రం చేశారని, ఇది నగరపాలక సంస్థ అధికారులకు కనువిప్పు కావాలన్నారు. ప్రత్యేక హోదా ఆత్మగౌరవ పోరాట కమిటీ కన్వీనర్ అవధానుల హరి తదితరులు మాట్లాడారు. జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీదుర్గ మాట్లాడుతూ ప్రతి నెలా పుష్కర నదుల పేర్లతో 12 మందికి అవార్డులను ప్రదానం చేస్తున్నామన్నారు. ఫౌండర్ ఛైర్మన్ తొడుపునూరి కిషన్ గుప్త, మాస్టర్‌జీ, వడిశలేరు బేబీ, మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం గంగానది పురష్కారాన్ని కొల్లివెలసి మనీషా, కొల్లిమళ్ల వైష్ణవికి అందజేశారు.

విస్తృతంగా పోలీసు తనిఖీలు
వై రామవరం, ఫిబ్రవరి 25: వై రామవరం వారపుసంత సందర్భంగా పోలీసులు సోమవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలున్నాయన్న సమాచారం మేరకు స్థానిక ఎస్సై ఎన్ సతీష్‌బాబు ఆద్వర్యంలో సిఆర్పీఎఫ్ ఇ42 బెటాలియన్ పోలీసుల సాయంతో లోతట్టుప్రాంతాల నుంచి వారపుసంతకు వచ్చే ప్రధాన రహదారిలోని అనుమానస్పద ప్రదేశాల్లోను, కల్వర్టులు తనిఖీ చేసారు. వారపుసంతకు వచ్చిపోయే వాహనాల్లో రవాణా చేస్తున్న సామాగ్రిని పరిశీలించారు. అనుమానస్పద వ్యక్తులు, అపరిచితులపై గట్టి నిఘా విధించారు.