తూర్పుగోదావరి

పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, ఫిబ్రవరి 25: తూర్పు-పశ్చిమగోదావరి పట్ట్భద్రుల శాసన మండలి నియోజక వర్గానికి సంబంధించి ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయింది. మంగళవారం నుండి అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. మార్చి 5వ తేదీవరకు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్తికేయ మిశ్రా, అసిస్టెంట్ రిటర్నిగ్ అధికారి గోవిందరాజుల ఎదుట అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. మార్చి 6వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. అభ్యర్థులు మార్చి 8వ తేదీలోపు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి వీలుంటుంది. మార్చి 22వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. మార్చి 26వ తేదీన తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించి, మార్చి 28వ తేదీతో పట్ట్భద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ప్రక్రియను ముగిస్తారు. పట్ట్భద్రుల నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సోమవారం ఉదయం కలెక్టరేట్ కోర్టు హాలులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ వివరాలను తెలియజేశారు. తూర్పు-పశ్చిమగోదావరి జిల్లా పట్ట్భద్రుల నియోజకవర్గ సభ్యులుగా ఉన్న కలిదిండి రవికిరణ్‌వర్మ పదవీ కాలం వచ్చే మార్చి 29వ తేదీతో ముగుస్తున్న కారణంగా ఈ నియోజకవర్గానికి కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఆదివారం రాత్రి షెడ్యూల్‌ను ప్రకటించిందన్నారు. ఈ ఎన్నిక నిర్వహణకు జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగాను, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల రెవెన్యూ అధికారులు ఎంవీ గోవిందరాజలు, ఎన్ సత్యనారాయణలు సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని చెప్పారు. అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేసే సమయంలో అభ్యర్థితోపాటు నలుగురికి మించి వ్యక్తులను అనుమతించరని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ ప్రకటన వెలువడిన 24వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలోకి వచ్చిందన్నారు. నియమావళిని ఖచ్చితంగా అమలుచేసేందుకు ఎంపీడీవోలు, పోలీసు అధికారులతో ఎంసీసీ బృందాలను ఏర్పాటుచేసినట్లు రిటర్నింగ్ అధికారి మిశ్రా తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 74, పశ్చిమగోదావరి జిల్లాలో 48 ఏర్పాటుచేశామని, జిల్లాను 33 జోన్‌లు, 33 రూట్‌లుగా విభజించామని వివరించారు. అదే విధంగా పశ్చిమగోదావరి జిల్లాలో 12 జోన్‌లు, 17 రూట్‌లుగా విభజించామని, పోలింగ్ ప్రక్రియకు జిల్లాలో 166, పశ్చిమగోదావరి జిల్లాలో 133 కలిపి మొత్తం 299 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ పోలింగ్ బ్యాలెట్ బాక్స్ విధానంలో జరుగుతుందని, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఏర్పాటుచేసినట్లు ఆయన పేర్కొన్నారు. 299 పోలింగ్ కేంద్రాలుగాను, 33 కేంద్రాల్లో 1400 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారని, ఈ కేంద్రాలకు అగ్జలరీ కేంద్రాలను ప్రతిపాదించినట్లు చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారం అందించేందుకు మీడియా బ్రీఫింగ్ సెంటర్‌ను, కలెక్టరేట్‌లోని ఓటరు హెల్ప్‌లైన్ కేంద్రం వద్ద ఏర్పాటుచేసినట్లు రిటర్నింగ్ అధికారి కార్తికేయ మిశ్రా తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఆర్వో ఎంవీ గోవిందరాజులు, ఎంసీఎంసీ కన్వీనర్ ఎం ఫ్రాన్సిస్ పాల్గొన్నారు.

నేటి నుండి ఎంసెట్-19 దరఖాస్తులు స్వీకరణ
*కన్వీనర్ ప్రొఫెసర్ సాయిబాబు
కాకినాడ సిటీ, ఫిబ్రవరి 25: ఎంసెట్-2019కు సంబంధించి దరఖాస్తులను బుధవారం నుండి స్వీకరించనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సిహెచ్ సాయిబాబు తెలియజేశారు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 2019-20 విద్యాసంవత్సరానికి బీటెక్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, బిఎస్సీ హార్టికల్చర్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్‌ఎస్సీ, బీఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల ప్రవేశానికి నోటిషికేషన్‌ను ఈనెల 20న విడుదల చేసినట్లు చెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎంసెట్ నిర్వహణను జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడ వరుసగా ఐదవసారి, మూడవసారి కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్టు జేఎన్‌టియుకె ఉపకులపతి, ఏపి ఎంసెట్-19 ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం రామలింగరాజు తెలిపారు. దరఖాస్తులను ఆన్‌లైన విధానంలో మంగళవారం నుండి స్వీకరిస్తామని, ఏపి ఆన్‌లైన, నెట్ బ్యాంకింగ్ ద్వారా 500 రూపాయలు రుసుం చెల్లించి దరఖాస్తు చేయాల్సి ఉంటుందన్నారు. ఇంజినీరింగ్ విభాగానికి పరీక్ష ఫీజు 500రూపాయలు, అగ్రికల్చరల్ విభాగానికి 500లు, రెండు విభాగాలకు కలిపి 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలియజేశారు. 500 రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ 4 వరకు, వెయ్యి రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ 9వరకు, ఐదువేల రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ 14 వరకు, 10 వేల అపరాధ రుసుముతో ఏప్రిల్ 19వ తేదీవరకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. పరీక్ష ఫీజును ఆన్‌లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుందని, దరఖాస్తుచేసుకునే విద్యార్ధులు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం హాల్ టికెట్ నంబర్, ఎస్‌ఎస్‌సి సర్ట్ఫికెట్ ప్రకారం పుట్టినతేదీ, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడిని తప్పనిసరిగా నమోదుచేయాల్సి ఉంటుందని కన్వీనర్ సాయిబాబా పేర్కొన్నారు. అదే విధంగా కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, సదరం సర్ట్ఫికెట్(అంగవైక్యం ఉన్నవారు), ఆదాయ ధృవీకరణ పత్రం, స్టడీ సర్ట్ఫికెట్స్, నివాస ధ్రువీకరణ పత్రాలను తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. దరఖాస్తును ఒకసారి మాత్రమే ఆన్‌లైన్‌లో ఆమోదిస్తామని, ఫీజు చెల్లింపు అనంతరం ఆయా వివరాలతోపాటు పేమెంట్ రిఫరెన్స్ ఐడి నంబర్ విద్యార్థి ఫోన్ నంబర్‌కు సమాచారం అందజేస్తామని అన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులో విద్యార్థి మూడు రీజినల్ సెంటర్లను ఎంపిక చేసుకోవలసి ఉంటుందన్నారు. విద్యార్థి ప్రాధాన్యతను బట్టి మూడింటిలో ఒక రీజినల్ సెంటర్‌లో మాత్రమే పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తామని తెలియజేశారు. హాల్ టిక్కెట్‌లను ఏప్రిల్ 16వ తేదీ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, ఇంజినీరింగ్ పరీక్షను ఏప్రిల్ 20, 21, 22, 23 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించారు. అగ్రికల్చర్ పరీక్షను ఏప్రిల్ 23, 24 తేదీల్లో ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. ఉర్దూ అనువాదం కావాలనుకునే వారు కర్నూలులో మాత్రమే పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తామని కన్వీనర్ సాయిబాబు చెప్పారు. ఈ ప్రవేశ పరీక్ష శ్రీకాకుళం, రాజాం, టెక్కలి, విజయనగరం, బొబ్బిలి, విశాఖపట్నం సిటీ, ఆనందపురం, గాజువాక, అనకాపల్లి, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, విజయవాడ, మచిలీపట్నం, మైలవరం, కంచికచర్ల, గుడ్లవల్లేరు, గుంటూరు పట్టణాల్లో నిర్వహిస్తామన్నారు. అదే విధంగా నరసారావుపేట, ఒంగోలు, మార్కాపురం, చీరాల, నెల్లూరు, కావలి, గూడూరు, చిత్తూరు, పుత్తూరు, తిరుపతి, మదనపల్లి, కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, అనంతపురం, పుట్టపర్తి, గుత్తి, హిందూపూర్, కర్నూలు, నంద్యాల, హైదరాబాద్‌లోని ఎస్పీ నగర్, నాచారం, సికింద్రాబాద్‌లలో ఎంపిక చేసిన కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. ఏపి ఎంసెట్-19కు సంబంధించి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు 0884-2340535,2356255్ఫన్ నంబర్లకు ఫోన్‌చేసి తెలుసుకోవచ్చని కన్వీనర్ సాయిబాబు తెలియజేశారు.

ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలి
*కలెక్టర్ కార్తికేయ మిశ్రా
కాకినాడ సిటీ, ఫిబ్రవరి 25: జిల్లాలో ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా అమలుచేయాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులతో సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయా విభాగాల నోడల్ అధికారులు పక్కా ప్రణాళికలతో ఎన్నికల ఏర్పాట్లు చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని తెలిపారు. దీని ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల విధులు, అత్యతం ప్రాధాన్యంగా తీసుకొని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఎన్నికల విధుల నిర్వహణలో కమ్యూనికేషన్స్‌లో అత్యంత ప్రాధానమైనవని, ఈమేరకు నిర్ధేశించిన సమయంలో సమాచారాన్ని అందించాలని చెప్పారు. కలెక్టరేట్‌లోని మీకోసం ప్రజావాణి హాలులో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేస్తున్నామని, అదే విధంగా హెల్పెలైన్ ఫిర్యాదుల పరిష్కారం ఇక్కడే జరుగుతుందన్నారు. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, స్ట్రాంగ్‌రూమ్, కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు తెలియజేశారు. ఎన్నికల పరిశీలకులకు ఏర్పాట్లు, ఐటి అప్లికేషన్స్, శాంతి భద్రతలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, పోలింగ్ స్టేషన్ల నిర్వహిణ, సిబ్బంది శిక్షణ, రవాణా, వెబ్ కాస్టింగ్‌లు అయా విభాగాల నోడల్ అధికారులు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈసమావేశంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ఎ మల్లికార్జున మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును పరిశీలించేందుకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఈ టీమ్‌ల ఆధ్వర్యంలో వివిధ అంశాలపై వీడియో రికార్డింగ్ చేస్తామన్నారు. అదే విధంగా పోలింగ్ వెబ్ కాస్టింగ్ కోసం జేఎన్‌టియుకె సహకారంతో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఎన్నికల సిబ్బందికి అవసరమైన శిక్షణ చేపట్టడానికి షెడ్యూల్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు కలెక్టరేట్‌లోని వివిధ విభాగాలతో నోడల్ అధికారులను సమన్వయం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈసమావేశంలో డిఎఫ్‌ఓ నందనీ సలారియా, జేసి-2 సత్తిబాబు, డీఆర్వో ఎంవీ గోవిందరాజులు, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్‌విఎస్ సుబ్బలక్ష్మి, గుడా వైస్ ఛైర్మన్ అమరేంద్ర, డ్వామా పీడి ఎం వెంకటరమణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.