తూర్పుగోదావరి

ఏలేరు కాలువలను ఆధునీకరిస్తాం: దేవినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 20: పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పనులను 2018నాటికి పూర్తి చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేసి, ఏడాదికి మూడు పంటలు పండించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం సమీపంలో ఏలేరు ఆధునీకరణ పనుల్లో భాగంగా 20 కోట్లతో చేపట్టిన గొర్రిఖండి ఆధునికీకరణ పనులను బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి దేవినేని మాట్లాడుతూ పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను ఈ ఏడాదే పూర్తిచేస్తామని, 2018కి మొదటి దశ పనులన్నీ పూర్తవుతాయన్నారు. ఈ ప్రాజెక్టు పనులను వచ్చే ఫిబ్రవరి నుండి మరింత వేగవంతం చేస్తామన్నారు. ఏలేరు కాలువల వ్యవస్థను త్వరగా ఆధునికీకరించి, ఈ ప్రాంత రైతాంగానికి పూర్తిగా ఉపయోగపడేవిధంగా నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు. ఏలేరు రిజర్వాయరు పరిధిలో ఉన్న 14టిఎంసిల నీటి కొరత తీర్చడానికి ఈ ఆధునీకరణ పనులు ఉపయోగపడతాయన్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ సీలేరు, బలిమెల నుండి నీటిని తీసుకువచ్చి, రెండవ పంటకు పూర్తిస్థాయిలో నీటిని అందిస్తామన్నారు. ఏలేరు ఆధునికీకరణ పనులకు రూ.170 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలియజేశారు. ఈ పనులు పూర్తయితే ఈ ప్రాంత రైతులు, ప్రజలకు అన్ని విధాలా మేలు జరుగుతుందన్నారు. 17వేల ఎకరాల ఆయకట్టును అదనంగా సాగులోకి తీసుకురావడానికి వీలవుతుందన్నారు. జిల్లా కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్, పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎన్ వర్మ, నీటి పారుదల శాఖ ఎస్‌ఇ ఎస్ సుగుణాకరరావు, ప్రాజెక్టు కమిటీ అధ్యక్షుడు జె చంటిబాబు, ఉపాధ్యక్షుడు ఎ భాస్కరరావు తదితరులు మంత్రి వెంట ఉన్నారు.