తూర్పుగోదావరి

55 కిలోల గంజాయి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, మే 8: సామర్లకోట రైల్వే స్టేషన్ ఆవరణలో నలుగురు యువతీ యువకుల నుండి పోలీసులు సుమారు రూ.లక్ష విలువచేసే గంజాయినీ పట్టుకుని వారిని అరెస్టు చేసిన ఘటన ఇది. ఆదివారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్దాపురం సిఐ కె శ్రీ్ధర్‌కుమార్ నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలోగల ఎస్‌బిఐ ఎటిఎం వద్ద ఎపి05 టిడి 7080 నంబరుగల ఆటోలో జార్జిపేటకు చెందిన మాసిన దొరబాబు, ఉదయకృష్ణ నగర్‌కు చెందిన దంగేటి బాబి, యానాంకు చెందిన జక్కంపూడి సత్యవేణి, తాళ్ళరేవు మండలం ఇంజరం గ్రామానికి చెందిన దారా నాగేశ్వరి అనుమానాస్పదంగా 5 పెద్ద బ్యాగ్‌లతో ఉండడంతో, సిఐ ఆదేశాల మేరకు సామర్లకోట ఎస్‌ఐ ఆకుల మురళీకృష్ణ సిబ్బందితో ఆకస్మికంగా దాడిచేసి వారిని బ్యాగ్‌లతో సహా పట్టుకున్నారు. అయిదు బ్యాగ్‌లలో సుమారు లక్ష రూపాయల విలువ చేసే 55 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తక్షణమే వారిని, పట్టుకున్న గంజాయిని సామర్లకోట మండల తహసీల్దార్ డి సునీల్‌బాబు వద్ద హాజరుపరిచారు. జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయిని రహస్యంగా ముంబయికి తరలిస్తున్నట్లు నిందితులు చెప్పినట్లు సిఐ చెప్పారు. ఇద్దరు యువకులు చదువు మధ్యలో మానివేయగా, ఇద్దరు యువతులు అమలాపురంలో నర్సింగ్ కోర్సు చదువుతున్నట్లు సిఐ వెల్లడించారు. రావులపాలెంనకు చెందిన శ్రీను అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఈ నలుగురు గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందినట్టు తెలిసింది. ఇలా తరలించినందుకు తమకు కొంత సొమ్ము ఇస్తున్నారని, ఈ సొమ్ముకు ఆశపడి గంజాయిని ముంబయికి తరలిస్తున్నట్లు నిందితులు నలుగురూ అంగీకరించినట్లు సిఐ శ్రీ్ధర్‌కుమార్ తెలిపారు. త్వరలోనే గంజాయి దందా నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ చెప్పారు. గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్న సామర్లకోట ఎస్‌ఐ ఆకుల మురళీకృష్ణను, సహకరించిన హెచ్‌సి కె శ్రీనివాసరావు, పిసిలు ఐ గణేష్‌బాబు, ఎ శ్రీనివాసరావు, కె సత్యనారాయణ, టి శ్రీనువాసులను ఈ సందర్భంగా సిఐ శ్రీ్ధర్‌కుమార్ అభినందించారు. ఈ సమావేశంలో ఇంకా ఎఎస్‌ఐలు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.