తూర్పుగోదావరి

పెరగనున్న అర్బన్ మండలాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 9: జిల్లాలో అర్బన్ ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తుండడంతో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త అర్బన్ మండలాలుగా విభజించనునానరు.న్నాయి. ఇందుకు సంబంధించి కసరత్తు మొదలైంది. తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం కొత్తగా కలిసిన మండలాలతో కలిపి 60 మండలాలుగా ఉన్నాయి. ఇప్పుడు మరో రెండు అర్బన్ మండలాలు పెరగనున్నాయి. వెరసి 62 మండలాలు కల్గిన జిల్లాగా అవతరించనుంది. జనాభా దామాషా ప్రకారం 18 లక్షల మందికి ఒక జిల్లా ఉండవలసి ఉంది. ఆమేరకు సుమారు లక్షన్నర జనాభాకు ఒక మండలం ఉండాలి. ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గం మూడేసి మండలాల పరిధిగా ఉంది. రాజమహేంద్రవరం అర్బన్ మండలం ప్రత్యేకించి ఒక నియోజకవర్గంగా ఉంది. అదే విధంగా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో అర్బన్‌లో శివారు భాగం, కడియం, రూరల్ మండలం కలిసి గ్రామీణ నియోజకవర్గంగా ఉంది. ఒక్క రాజమహేంద్రవరం అర్బన్ మండలమే ప్రత్యేకించి ఒక నియోజకవర్గంగా ఉన్న నేపథ్యంలో 50 డివిజన్లు, సుమారు మూడున్నర లక్షల జనాభా కల్గి ఉంది. ఈ నియోజకవర్గంలోని అర్బన్ మండలంలో ఒక మేయర్, ఇద్దరు శాసన సభ్యులు, ఇద్దరు శాసన మండలి సభ్యులు, ఒక ఎంపి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంతటి రాజకీయ పదవుల బరువు బాధ్యతలు కల్గిన అర్బన్ మండలం పరిధిని పరిపాలనా సౌలభ్యం కోసం విభజించనున్నారు. ఈ మేరకు 50 డివిజన్లను చెరిసగంగా మార్చి రాజమహేంద్రవరం అర్బన్ -1, 2లుగా మార్చనున్నారు. ఇప్పటికే ఇద్దరు ఐఎఎస్‌లు, ఒక ఐపిఎస్ అధికారి కూడా ఉన్నారు. ఏదైనా సంఘటన జరిగితే రెవెన్యూ పరంగా హాజరయ్యేందుకు అవకాశం లేకుండా ఉంది. చాలీచాలని సిబ్బందితో పౌర సేవలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. రాజమహేంద్రవరం అర్బన్ మండల పరిధిలో 14 మంది విఆర్వోలు ఉండవలసి ఉండగా, కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఒక తహసీల్దార్‌కు విధులు విస్తృతంగా ఉండడంతో పరిపాలనా సౌలభ్యం కోసం మరో అర్బన్ మండల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. 251 పోలింగ్ స్టేషన్లు కల్గిన విస్తృత ప్రాంతం కాబట్టి విభజన చేస్తేనే గానీ సకాలంలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందే పరిస్థితి లేదని గుర్తించి, రాజమహేంద్రవరాన్ని రెండు అర్బన్ మండలాలుగా విభజించనున్నారు. ఒక్కో అర్బన్ మండలంలో పాతిక డివిజన్లు వచ్చేలా విభజనలు చేస్తున్నారు. ప్రభుత్వ జనాభా మార్గదర్శకాల ప్రకారం అయితే ఈ జిల్లాను మూడు జిల్లాలుగా మార్చవలసి ఉంది. ఈ దిశగా కూడా కసరత్తు జరుగుతోంది. ముందుగా శరవేగంగా విస్తరిస్తున్న రాజమహేంద్రవరం నగరాన్ని మాస్టర్ ప్లాన్, విలీన గ్రామాలను కలుపుకొని అధికార యంత్రాంగ పాలనకు ఈ విభజన చేపడుతున్నట్టు సమాచారం. సాధ్యమైనంత త్వరగా ఈ కసరత్తు పూర్తిచేయనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు కూడా ఈ రెండు అర్బన్ ప్రాంతాల్లోనే ఆవిర్భవిస్తున్నాయి. భూ సేకరణ అంశాలను కూడా క్షేత్రస్థాయిలో ఈ అర్బన్ మండలాల్లో చేపట్టేందుకు ఇటు విధుల వికేంద్రీకరణ, అటు పరిపాలనా సౌలభ్యం కోసం ఈ అర్బన్ మండలాల ఆవిర్భావం తధ్యమంటున్నారు.

రావులపాలెం విద్యార్థికి ఎంసెట్‌లో 2వ ర్యాంకు

రావులపాలెం, మే 9: రావులపాలెంకు చెందిన చప్పిడి లక్ష్మీనారాయణ ఎంసెట్ ఫలితాల్లో రాష్టస్థ్రాయిలో ఇంజనీరింగ్ విభాగంలో ద్వితీయ స్థానాన్ని సాధించాడు. సోమవారం రాత్రి ఫలితాలు విడుదలచేయగా, లక్ష్మీనారాయణ 160కు 157 మార్కులు సాధించి రాష్టస్థ్రాయిలో రెండవ ర్యాంకు సాధించినట్టు వెల్లడైంది. రావులపాలెంకు చెందిన క్లాస్-1 కాంట్రాక్టర్ చప్పిడి వరప్రసాద్, రాజోలు ఆర్‌అండ్‌బి జెఇ సత్యవేణిల ద్వితీయ కుమారుడు లక్ష్మీనారాయణ కెకెఆర్ (గుడివాడ) గౌతం కానె్సఫ్ట్ స్కూల్లో టెన్త్ 9.8 గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించాడు. అలాగే విజయవాడ గోశాల చైతన్య నారాయణ కళాశాలలో ఇంటర్ ఎంపిసి చదివాడు. వెయ్యికి 982 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ప్రస్తుతం విజయవాడలో ఐఐటి కోచింగ్ తీసుకుంటున్న లక్ష్మీనారాయణ ఇటీవల జెఇఇ మెయిన్స్‌లో 360కు 330 మార్కులు సాధించి అడ్వాన్స్‌కు ఎంపికయ్యాడు. లక్ష్మీనారాయణ అన్న లక్ష్మీగణపతిరావు కూడా 2014లో జెఇఇ అడ్వాన్స్‌లో 82వ ర్యాంకు సాధించి ప్రస్తుతం మద్రాసు ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. లక్ష్మీనారాయణకు ఎంసెట్‌లో రాష్టస్థ్రాయిలో రెండవ ర్యాంకు రావడంతో రావులపాలెంలోని అతని ఇంట్లో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషంతో మిఠాయిలు తినిపించుకుని, సంబరాలు జరుపుకొన్నారు.
జెఇఇలో ఆలిండియా మొదటి స్థానం సాధించాలన్నది లక్ష్యం
జెఇఇ అడ్వాన్స్‌లో ఆలిండియా మొదటి స్థానం సాధించాలన్నది తన లక్ష్యంగా లక్ష్మీనారాయణ చెప్పాడు. ముంబాయి ఐఐటిలో కంప్యూటర్ సైన్సు చేయాలనుకుంటున్నట్టు ఫోన్లో స్థానిక విలేఖర్లకు తెలిపాడు. తన తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతోనే తానీ ఫలితాన్ని సాధించినట్టు చెప్పాడు.