తూర్పుగోదావరి

ప్రత్యేక ధర్నా విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 10: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా విజయవంతమయింది. మండుటెండను కూడా లెక్కచేయకుండా ఈ ధర్నాకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. మధ్యాహ్నం కలెక్టరేట్ వేదిక వద్దకు జగన్ సుమారు ఒంటిగంటకు చేరుకున్నారు. 20 నిమిషాల సేపు మాత్రమే జగన్ ప్రసంగించారు. ధర్నాకు జగ్గంపేట, ప్రత్తిపాడుతో పాటు కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గాల నుండి అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు వాహనాల మళ్ళింపు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా వేదిక వద్ద, కలెక్టరేట్‌కి ఇరువైపుల పోలీసులు భారీగా మోహరించారు. జగన్ ప్రసంగం చంద్రబాబుపై ధ్వజమెత్తుతూ సాగింది. ప్రసంగం అనంతరం వినతిపత్రాన్ని అందించేందుకు జగన్ వైసిపి నాయకులతో కలెక్టరేట్ గేట్ వద్దకు తన సొంత కారులో చేరుకున్నారు. అయితే లోనికి కారుతో వెళ్ళేందుకు పోలీసులు అభ్యంతరం వ్యక్తంచేశారు. పోలీసులు ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేయగా కొంతమందితోనే జగన్ కారులో వెళ్ళేందుకు అనుమతించారు. అనంతరం ప్రత్యేక హోదాను కోరుతూ డిఆర్‌ఓ బి యాదగిరికి వినతిపత్రాన్ని సమర్పించారు. ధర్నాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, పార్టీ నాయకులు ముత్తా శశిధర్, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్‌విజెఆర్ కుమార్, వైద్య విభాగం జిల్లా నాయకుడు డాక్టర్ యనమదల మురళీకృష్ణ, యనమదల గీత, రావూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జగన్‌కు ప్రత్యేక ప్రతిభావంతురాలి వినతి
కలెక్టర్ కార్యాలయంలోనికి చేరుకోగా జగన్ కోసం అక్కడి వేచి ఉన్న కాకినాడ ఇంద్రపాలెం నేరేళ్ళమ్మ కాలనీకి చెందిన ప్రత్యేక ప్రతిభావంతురాలు నలమాటి ఏసుమణి తాను ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నానని జగన్‌కు వివరించారు. ఉద్యోగం లేక కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉన్నామని ప్రాధేయపడింది. జగన్ స్పందించి ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇవ్వకపోగా ఉన్నవారిని విధుల నుండి తొలగిస్తున్నారని చెప్పారు. తరువాత వచ్చేది మన ప్రభుత్వమని, అప్పుడే ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఏసుమణికి 10 వేల రూపాయలు సహాయమందించి కిరాణా దుకాణాన్ని పెట్టించి ఆమెను ఆర్థికంగా ఆదుకోవాలని అక్కడున్న వైసిపి కాకినాడ సిటీ కో-ఆర్డినేటర్ ముత్తా శశిధర్‌కు సూచించారు.