తూర్పుగోదావరి

పెద్దాపురం టు రాజమండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 10: పెద్దాపురంలో ముఖ్యమంత్రి స్విచ్చాన్ చేస్తే రాజమహేంద్రవరంలో బల్బు వెలుగుతుంది. ఇదేమిటనుకుంటున్నారా?!..టెక్నాలజీ అంటే అమిత ఇష్టం చూపించే ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్, అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి భీమశంకరరావు ఈ ఏర్పాటుచేశారు. జిల్లాను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తున్న క్రమంలో రాజమహేంద్రవరంలోని రోడ్డు కం రైలు వంతెనపై రంగురంగుల విద్యుదీకరణ ఏర్పాటుచేస్తున్నారు. ఆసియాలోనే రెండవ అతి పెద్ద రైలు వంతెన అయిన రోడ్డుకం రైలు వంతెనకు పుష్కరాల సమయంలో విద్యుదీకరణ చేశారు. ఇప్పుడు పర్యాటక విశేషంగా రూపొందించేందుకు ఈ వంతెనను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించనున్నారు. రోడ్లు భవనాల శాఖకు ఇందుకోసం నిధులు విడుదల చేశారు. ఈ విద్యుత్ దీపాల అలంకరణ నిర్వహణ ఆర్‌అండ్‌బికి అప్పగించారు. రూ.కోటి 10 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో రంగురంగుల విద్యుద్దీపాలను అలంకరించారు. ఈ నెల 18న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని రాజమహేంద్రవరంలోని మున్సిపల్ స్టేడియం గ్రౌండ్స్‌లో ఆవిష్కరిస్తారు. అనంతరం ఈ శిలాఫలకానే్న తీసుకువెళ్లి రోడ్డుకం రైలు వంతెనపై అమరుస్తారు. ముఖ్యమంత్రి పర్యటనలో మధురపూడి విమానాశ్రయంలో దిగి అక్కడ నుండి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుచేసే కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం పెద్దాపురం మున్సిపాల్టీ ఉత్సవాలు ప్రారంభించేందుకు వెళతారు. పెద్దాపురంలో జరిగే కార్యక్రమాల్లో ఉండగా చీకటి పడుతుంది, సరిగ్గా అక్కడి నుండే ముఖ్యమంత్రి రిమోట్ స్విచ్ ఆన్‌చేస్తే రాజమహేంద్రవరంలోని రోడ్డుకం రైలు వంతెనపై లైట్లు వెలిగేలా ఏర్పాటుచేశారు. ఇందుకు అవసరమైన రిమోట్‌ను హైదరాబాద్ నుండి రప్పించేందుకు ఏర్పాటుచేశారు. పర్యాటక విశేషంగా ఈ రంగురంగుల విద్యుద్దీకరణ ప్రాజెక్టు చేపట్టారు. రోడ్డుకంరైలు వంతెనపై లైట్లు మిరుమిట్లు గోదావరి నదిలో ప్రతిబింబిస్తూ ఒక సుందర దృశ్యం ఆవిష్కృతమయ్యేలా పర్యాటక శోభతో మెరిసిపోయేలా చేశారు. మొత్తంపై రానున్న కాలంలో రోడ్డుకంరైలు వంతెన ఆసియాలోనే అతి పెద్ద రోడ్డుకం రైలు వంతెనగా ప్రాశస్త్యం పొందేలా జిల్లా టూరిజం హబ్‌లో భాగంగా అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి పెద్దాపురం నుండి రిమోట్ ఆపరేట్ ద్వారా రాజమహేంద్రవరంలో లైట్లు వెలిగించడం కూడా ఒక విశేషంగానే అధికారులు ఏర్పాట్లు చేశారు.