తూర్పుగోదావరి

ఎంసెట్ ర్యాంకర్‌కు అభినందనల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, మే 10: ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో రాష్ట్ర రెండో ర్యాంకు సాధించిన రావులపాలెం విద్యార్థి చప్పిడి లక్ష్మీనారాయణకు అభినందనలు వెల్లువెత్తాయి. మంగళవారం స్థానికంగా గల విద్యార్థి ఇంటికి పలువురు నాయకులు, ప్రముఖులు వెళ్లి అతని తల్లిదండ్రులు క్లాస్-వన్ కాంట్రాక్టరు చప్పిడి వరప్రసాద్, రాజోలు ఆర్‌అండ్‌బి జెఇ సత్యవేణిలను అభినందించారు. భవిష్యత్తులో లక్ష్మీనారాయణ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. అభినందించిన వారిలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఎంపిపి కోట చెల్లయ్య, వైస్-ఎంపిపి దండు సుబ్రహ్మణ్యవర్మ, విద్యా కమిటీ ఛైర్మన్ పోతంశెట్టి కనికిరెడ్డి, మాజీ ఛైర్మన్ ద్వారంపూడి వెంకటరెడ్డి, సిఆర్సీ అధ్యక్షుడు నందం వీర వెంకట సత్యనారాయణ, మాజీ సర్పంచ్ డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి, సర్పంచ్ పోతుమూడి విజయలక్ష్మి, ఉప సర్పంచ్ కొవ్వూరి జగన్నాథరెడ్డి తదితరులు ఉన్నారు.

జూన్ 15 నాటికి స్వచ్ఛ కాకినాడ
కాకినాడ, మే 10: వచ్చే జూన్ నెల 15వ తేదీనాటికి కాకినాడ నగరాన్ని బహిరంగ మలవిసర్జన లేని నగరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ అరుణ్‌కుమార్ నగరపాలక అధికారులతో కలిసి రేచర్లపేట, సాంబమూర్తినగర్ ప్రాంతాల్లో పర్యటించి, అక్కడ నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇతర వసతులను పరిశీలించారు. స్వంత ఇళ్ళు లేని వారికి సామాజిక మరుగుదొడ్లను నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ అలీంబాషా, ఎస్‌ఇ నవరోహిణి, ఇఇ విజయ్‌కుమార్, ఎంహెచ్‌ఓ శైలజ తదితర అధికారులు పాల్గొన్నారు.