తూర్పుగోదావరి

వెల్డింగ్ చేస్తుండగా స్కూలు వ్యాను దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయినవిల్లి, మే 10: మండలంలోని కోనసీమ విద్యాశ్రమం స్కూలుకు చెందిన వ్యాన్ మరమ్మతు చేస్తుండగా ఒక్కసారిగా రేగిన మంటల్లో దగ్ధమయ్యింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ముక్తేశ్వరం అగ్రహారం రోడ్డులో ఉన్న విద్యాశ్రమం స్కూలు పక్కన కొబ్బరితోటలో స్కూలు వ్యాన్‌కు గత వారం రోజులుగా మరమ్మతులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్కూలు వ్యాన్ కేబిన్‌పై వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు రావడంతో దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. దీంతో స్థానికులు హుటాహుటిన వ్యాన్ దగ్గరకు చేరి మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. అయితే స్కూల్ వ్యాన్ మాత్రం పూర్తిగా మంటల్లో దగ్ధమయ్యింది. సుమారు లక్ష రూపాయలు నష్టం వాటిల్లిందని స్థానికులు తెలిపారు.

వినాయకుని ఆకారంలో కంద
ఏలేశ్వరం, మే 10: ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో ఉన్న వాగువారి వీధిలో ఉన్న వాగు సుందరరావు పెరట్లో పెంచిన కంద దుంప వినాయకుడి ఆకారంలో రూపుదిద్దుకుంది. ఈ వింతాకృతిని చూసేందుకు మంగళవారం జనం క్యూకట్టారు. కందకు పూజలు నిర్వహించి, ఏలేరు నదిలో వదిలేందుకు నిర్ణయించారు.