తూర్పుగోదావరి

పెనుగాలుల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 12: జిల్లాలో గురువారం సాయంత్రం వీచిన పెనుగాలులకు పలుచోట్ల విద్యుత్ ఫీడర్లు ధ్వంసమయ్యాయి. విశాఖ వైపు నుండి జిల్లాను తాకిన పెనుగాలుల వల్ల జగ్గంపేట, గోకవరం, కిర్లంపూడి, కాకినాడ, పిఠాపురం, గొల్లప్రోలు, తుని, తొండంగి, కోటనందూరు, శంఖవరం, పెద్దాపురం, తాళ్లరేవు, రంగంపేట, గండేపల్లి, రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్, అనపర్తి, రాయవరం, రామచంద్రపురం, కొత్తపేట, అమలాపురం, ముమ్మిడివరం తదితర ప్రాంతాల్లో తోటలతోపాటు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం తలెత్తింది. ఈదురుగాలులు ప్రచంఢవేగంతో ఈ ప్రాంతాలను చుట్టుముట్టాయి. మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. విద్యుత్ ఫీడర్లు కాలిపోవడం, సబ్‌స్టేషన్లలో ఫీజులు పోవడం, ఎర్త్‌కావడం వంటి సాంకేతిక సమస్యలు ఎదురై జిల్లాలో పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ గాలులు వీయడంతో రాజమహేంద్రవరం తదితర చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జగ్గంపేట, అమలాపురం, కాకినాడ ప్రాంతాల్లో ఫీడర్లు ఫ్లాష్ కావడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రామచంద్రపురం 132 కెవి సబ్‌స్టేషన్ పరిధిలో ఫీజు కొట్టివేయడంతో ఆ సబ్‌స్టేషన్ పరిధిలో 33కెవి స్టేషన్ల విద్యుత్ సరఫరాకు విఘాతం కలిగింది. ఫ్లాష్ ఓవర్ తలెత్తడంతో రామచంద్రపురం నుండి కొత్తపేట వరకు విద్యుత్ సరఫరాకు విఘాతం ఏర్పడింది. ఇప్పటివరకు ఎండ వేడిలో విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఒక్కసారిగా చల్లగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం రావడంతో ఫ్లాష్ ఓవర్ అయ్యాయని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. తలెత్తిన ఫీడర్ల డిప్‌లను వెనువెంటనే బాగుచేసి ఎక్కడికక్కడ గంట, రెండు గంటల వ్యవధిలోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకున్నామని ట్రాన్స్‌కో ఎస్‌ఇ ప్రసాద్ తెలిపారు. ఇదిలావుండగా జిల్లాలో భారీ ఉరుములతో కూడిన ఒక మోస్తరు నుండి భారీవర్షాలు కురిశాయి. ఆకాశంలో కారుమబ్బులు కమ్మి వాతావరణం అంతా ఒక్కసారిగా చల్లబడింది.