తూర్పుగోదావరి

ఐ సెట్‌కు ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, మే 13: ఎపి ఐసెట్ 2016 ప్రవేశపరీక్షకు సంబంధించి స్థానిక ఎస్‌కెబిఆర్ కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు రీజనల్ కో-ఆర్డినేటర్ చల్లా రామకృష్ణ, చీఫ్ సూపరింటెండెంట్ కొండా నాగవెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం వారు స్థానిక విలేఖరులకు వివరాలను అందజేశారు. ఈ నెల 16న ఉదయం 10 గంటల నుండి 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే అందరికీ హాల్‌టిక్కెట్లు అందుబాటులో ఉంచామని, హాల్ టిక్కెట్లపై ఫొటో లేని వారు రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో కళాశాలలో సంప్రదించి డూప్లికేట్ హాల్‌టిక్కెట్టును పొందవచ్చన్నారు. హాల్‌టిక్కెట్టు అందనివారు దరఖాస్తు చేసిన ఆధారాలు, ఆధార్‌కార్డుతో పాటు రూ. 50లు చెల్లించి డూప్లికేట్ హాల్‌టిక్కెట్‌ను పొందవచ్చని వారు తెలిపారు. దీనికోసం కళాశాలలో 15వ తేదీ ఉదయం 10నుండి సాయంత్రం 4గంటల వరకు 16వ తేదీ ఉదయం 8.30 గంటల వరకు డూప్లికేట్ హాల్‌టిక్కెట్లు జారీచేసేలా ఏర్పాట్లు చేసినట్టు వారు చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 9.30 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని వారు కోరారు. ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా హాలులోకి అనుమతించబడవని, ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తించాలని వారు సూచించారు.